Breaking News

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధం.. కాగ్ రిపోర్ట్ సైతం..?

Published on Sat, 02/22/2025 - 17:36

ఢిల్లీ:  ఢిల్లీ రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ నెల 24వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 24,25,27 వ తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. 24వ తేదీన  ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు, అదే తేదీ మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ ఎన్నిక జరుగనుంది. 25వ తేదీన లెఫ్టినెంట్ గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగం ఉటుంది. ఇక 27వ తేదీ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ జరుగనుంది.

మరొకవైపు 25వ తేదీన ఆమ్ ఆద్మీ  పార్టీ(ఆప్) ప్రభుత్వంలో పెండింగ్ లో ఉంచిన కాగ్ రిపోర్ట్ ను సైతం అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 25, 27 తేదీల్లో కాగ్ రిపోర్ట్ పై చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. తాము అసెంబ్లీ తొలి సెషన్ లోనే కాగ్ రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాగ్ రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ నిధులను గత పాలకు దుర్వినియోగం చేశారని, ఎక్సైజ్ పాలసీలో అవతవకలు జరిగాయని కాగ్ నివేదిక పేర్కొన్న తరుణంలో దానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ.. కాగ్ నివేదికపై పదే పదే పట్టుబట్టింది. కానీ అది చివరకు అసెంబ్లీకి రాలేదు. దాంతో ప్రస్తుత బీజేపీ సర్కారు కాగ్ నివేదికను అసెంబ్లీ సాక్షిగా బహిర్గతం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)