Breaking News

నామినేషన్‌కు ‘మృతుడు’.. కలెక్టరేట్‌లో కలకలం!

Published on Thu, 05/09/2024 - 12:29

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని వీవీఐపీ సీటు అయిన వారణాసిలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో ఇది హాట్‌ సీటుగా మారింది. తాజాగా వారణాసిలో ‘నేను బతికే ఉన్నాను’ అనే ప్లకార్డు పట్టుకుని ఓ వ్యక్తి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు కలెక్టరేట్‌కు చేరుకున్నాడు. అతనిని చూసిన అక్కడున్నవారంతా ఆశ్యర్యపోయారు.

సంతోష్ మురత్ సింగ్ అనే వ్యక్తి రూ. 25 వేల రూపాయలతోపాటు నామినేషన్ ఫారం పట్టుకుని కలెక్టరేట్‌కు వచ్చాడు. అయితే కలెక్టరేట్ గేటు వద్దనే అధికారులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన సంతోష్ మురత్ సింగ్ గేటు బయట ఆందోళనకు దిగాడు.

సంతోష్ మురత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాను చనిపోయినట్లు రెవెన్యూ రికార్డుల్లో అబద్దపు రాతలు రాయించి, కొందరు మోసపూరితంగా తన భూమిని స్వాధీనం చేసుకున్నారని వాపోయాడు. ఇప్పుడు తాను జీవించే ఉన్నానని నిరూపించుకునేందుకే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.

ఇలా ఎన్నికల్లో పోటీకి దిగడం సంతోష్‌కి కొత్తేమీ కాదు. 20 ఏళ్లుగా పలు ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నాడు. 2012లో రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. 2014, 2019లలో వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని మోదీపై పోటీ చేసేందుకు సంతోష్ నామినేషన్ దాఖలు చేశాడు. అయితే  అతని దరఖాస్తు తిరస్కరణకు గురైంది.

రెవెన్యూ రికార్డుల ప్రకారం వారణాసిలోని చితౌని నివాసి సంతోష్ మురత్ సింగ్ 2003లో ముంబైలో రైలులో బాంబు పేలుళ్లు సంభవించినప్పుడు మృతి చెందాడు. నకిలీ మరణ ధృవీకరణ పత్రం ఆధారంగా, అతని 1.5 ఎకరాల భూమిని అతని బంధువులు స్వాధీనం చేసుకుని, దానిని విక్రయించారు. సంతోష్‌ తాను సజీవంగానే ఉన్నానని, తన భూమిని దక్కించుకునేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అందరితో చెబుతుంటాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)