Breaking News

ఇక్కడ బీజేపీకి ఒక్క ఎంపీ సీటూ రావొద్దు

Published on Mon, 04/01/2024 - 05:51

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీ ప్రమాదం ముంచుకొస్తొందని... మతోన్మాద వాతావరణాన్ని సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని సీపీ ఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణలో ఒక్క ఎంపీ స్థానం గెలవకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గం సమావేశం జరగ్గా ఆదివారం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు ఎంబీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీజేపీని ఈ ఎన్నికల్లో గద్దెదించడం తక్షణ రాజకీయ కర్తవ్యమన్నారు.  బీజేపీలో ఉంటే నీతిపరులు లేదంటే అవినీతిపరు లు అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. 2019లో వచ్చిన ఫలితాలు రావేమోననే భయంతోనే బీజేపీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేసిందని ఆరోపించారు.

ఫోన్‌ట్యాపింగ్‌ అప్రజాస్వామికం: ఎస్‌ వీరయ్య
ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారం అప్రజాస్వామికమని, వ్యక్తిగత గోప్యతకు ఇది భంగం కలిగించడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్‌.వీరయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలో వేసవితో పాటు కరువు ప్రారంభమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరా కు రూ. 20 వేలు నష్టపరిహారం చెల్లించాలని కోరిన వీరయ్య..  మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్‌ ఇస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.  పార్ల మెంటు ఎన్నికల్లో సీపీఐ వైఖరిని  ప్రకటించాలని ఆయన కోరారు. అవసరమైతే సీపీఐ, సీపీఎం సంప్రదించుకుంటాయని, వర్తమాన రాజకీయ పరిణామాలను చూసి ఎవరికి మద్దతివ్వాలో  త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని వీరయ్య వెల్లడించారు.

#

Tags : 1

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)