Breaking News

సీపీఎంకు ఎక్కడా డిపాజిట్లు దక్కలే! 

Published on Mon, 12/04/2023 - 05:00

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంకు ఘోర పరాభవం మిగిలింది. ఒంటరిగా పోటీచేసిన 19 స్థానాల్లోనూ దాదాపు అన్నిచోట్లా డిపాజిట్లు కోల్పోయింది. ఖమ్మం జిల్లా పాలేరులో పోటీచేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా గౌరవప్రదమైన ఓట్లు పొందలేకపోయారు. ఆయనకు 16వ రౌండ్‌ వచ్చేసరికి కేవలం 4,354 ఓట్లు వచ్చాయి. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డికి 3,234 ఓట్లు మాత్రమే వచ్చాయి.

కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థురాలిగా బరిలోకి దిగిన శిరీష (బర్రెలక్క)కు 5,598 ఓట్లు వచ్చాయి. ఆ స్థాయి ఓట్లు కూడా సీపీఎం అభ్యర్థులకు రాకపోవడం గమనార్హం. కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో ప్రతిష్టకు పోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. సీపీఎం తాను పోటీచేసిన మొత్తం 16 స్థానాల్లోనూ కలిపి 49,604 ఓట్లు మాత్రమే సాధించింది.  

కాంగ్రెస్‌కే పడ్డ సీపీఎం ఓట్లు! 
పార్టీ కార్యకర్తలు అనేకచోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓట్లు వేశారన్న చర్చ జరుగుతోంది. తాము పోటీచేయని చోట కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓటు వేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొనగా, రాష్ట్ర పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాత్రం ప్రజాతంత్ర లౌకిక శక్తులకు ఓటు వేయాలని మాత్రమే చెప్పారు.

ఈ విషయంలో కేంద్ర కమిటీకి, రాష్ట్ర కమిటీకి మధ్య వైరుధ్యం నెలకొందన్న విమర్శలు వచ్చాయి. కాగా, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 26,568 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రెండు ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీకి దక్కనున్నాయి. సీపీఎం మాత్రం పరాజయం పాలవడమే కాకుండా, తన ఓటు బ్యాంకును కూడా నిలబెట్టుకోలేకపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)