Breaking News

కూతురితో వివాదం.. ముత్తిరెడ్డికి బిగ్‌ రిలీఫ్‌

Published on Sat, 08/12/2023 - 20:21

సాక్షి, జనగామ: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయన కూతురు తుల్జా భవానీరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తండ్రి మీద మీడియా ముందు విపరీతమైన ఆరోపణలు చేస్తూ వస్తోంది తుల్జా భవానీ. అయితే ఈ తండ్రీకూతుళ్ల కోల్డ్‌వార్‌ కొత్త మలుపు తిరిగింది. భవానీ అడ్డగోలుగా తన మీద ఆరోపణలు చేయకుండా నిలువరించేలా.. కోర్టు ద్వారా భవానీకి నోటీసులు జారీ చేశారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. 

తన పరువుకి భంగం కలిగించేలా కూతురు తుల్జా భవానీరెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడవద్దని.. అందుకు తగ్గ ఆదేశాలు జారీ చేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ముత్తిరెడ్డి విజ్ఞప్తిని కోర్టు పరిశీలించింది. ప్రెస్, మీడియా, వాట్సాప్ ద్వారా ప్రకటనలు. YouTube, ఇతర ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాతో సహా మౌఖిక లేదంటే వ్రాత రూపంలో నేరుగాకానీ, పరోక్షంగాకానీ మాట్లాడవద్దని తుల్జా భవానీరెడ్డికి మధ్యంతర నిషేధ ఉత్తర్వు జారీ చేసింది కోర్టు. తద్వారా ముత్తిరెడ్డికి భారీ ఉపశమనం లభించినట్లయ్యింది.

భూవ్యవహారంతో మొదలైన ఈ తండ్రీకూతుళ్ల మాటల యుద్ధం రోజురోజుకీ ముదురిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూట్యూబ్‌ సహా అన్ని మీడియా ఛానెల్స్‌ ముందు తండ్రిపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారామె. అంతేకాదు.. తనకు రాజకీయాలంటే ఇష్టం లేదని చెబుతూనే..  తన తండ్రి దుర్మార్గుడని, సీటు ఇవ్వొద్దంటూ బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసిందామె. ముత్తిరెడ్డి మాత్రం తమ కుటుంబ సమస్యలను ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారని, తన కూతురిని తప్పు దోవ పట్టిస్తున్నారని చెబుతున్నారు . మరోవైపు తన కూతురు, అల్లుడు తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ దాఖలైన కేసులో విచారణ కొనసాగుతోంది కూడా.

Videos

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు