Breaking News

‘MVA’లో కొలిక్కి వచ్చిన సీట్ల పంచాయితీ .. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే!

Published on Wed, 10/23/2024 - 19:35

ముంబై : మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో సీట్ల పంచాయితీ కొలిక్కి వచ్చింది.  కూటమిలోని ఒక్కో పార్టీ 85 సీట్లలో పోటీ చేస్తున్నట్లు కుటమి నేతలు బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు.

మహరాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్‌ 20న జరగనున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, శివసేన (ఉద్దవ్‌ ఠాక్రే వర్గం),నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (శరద్‌పవార్‌ వర్గం)లోని మహా వికాస్‌ అఘాడీ కూటమి పోటీ చేస్తున్నాయి. 

నిన్న మొన్నటి వరకు ఎంవీఏలోని ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై స్పష్టత లేదు. సీట్ల పంపకాల విషయంలో కూటమి పార్టీల నేతల మధ్య ఫలు దఫాలుగా జరిగిన చర్చాలు జరిగాయి. తాజాగా బుధవారం జరిగిన చర్చల అనంతరం  మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో మహా వికాస్‌ అఘాడీ కూటమి 255 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కూటమి నేతలు వెల్లడించారు. మిగిలిన 33 స్థానాలపై తర్వలో స్పష్టత ఇవ్వనున్నారు.   

బీజేపీ తొలి జాబితా విడుదల  
మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను 99 మందితో బీజేపీ  మొదటి జాబితా విడుదల చేసింది. వీరిలో 71 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. ఇందులో ఇటీవలే కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన అశోక్‌ చవాన్‌ కుమార్తె శ్రీజయ చవాన్‌కు  చోటు దక్కింది. ఇంకా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బవాంకులె, అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్, మంత్రులు గిరీశ్‌ మహాజన్, సుధీర్‌ ముంగంటివార్, చంద్రకాంత్‌ పాటిల్‌ వంటి ప్రముఖులు  ఉన్నారు. 

జాబితాలో మొత్తం 13 మహిళల పేర్లున్నాయి. చించ్వాడ్, కల్యాణ్‌ ఈస్ట్, శ్రీగొండ స్థానాల్లో మాత్రం సిట్టింగ్‌లకు బదులు కొత్త వారికి అవకాశమిచ్చింది. ముంబైలోని పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేల్లో 14 మందిని మళ్లీ నామినేట్‌ చేసింది. సుమారు 150 సీట్లలో పోటీ చేసేందుకు మిత్రపక్షాలతో బీజేపీ మంతనాలు సాగిస్తోంది. 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)