Breaking News

‘నా నియోజకవర్గానికి వస్తే మీకు మర్యాద దక్కదు’

Published on Fri, 07/24/2026 - 18:50

యాదాద్రి:  కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్‌పై  సొంత పార్టీకే చెందిన ఎమ్మెల్యే మందుల సామేల్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనకు సమాచారం లేకుండా తన నియోజకవర్గంలో అడుగుపెట్టే అధికారం ఎవరిచ్చారంటూ మండిపడ్డారు. ప్రొటోకాల్‌ పాటించాలని తెలియదా, తన నియోజకవర్గానికి వస్తే మర్యాద దక్కదంటూ హెచ్చరించారు. 

రెండు కిలోమీటర్ల రోడ్డు కోసం మంత్రి కోమటిరెడ్డి చుట్టూ వందసార్లు తిరిగాను. ఆర్‌ అండ్‌ బీ మినిస్టర్‌గా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏం చేశారు?, రాజగోపాల్‌రెడ్డికి తుంగతుర్తి గురించి ఎందుకు?,  నా నియోజకవర్గం జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ వస్తే ప్రొటోకాల్‌ పాటించాలని తెలియదా?, నాకు సమాచారం లేకుండా నా నియోజకవర్గంలో అడుగుపెట్టే అధికారం నీకు ఎవరు ఇచ్చారు. మీ నియోజకవర్గాల్లో మీ సక్కదనం చూసుకోండి. మీ దగ్గర మేం చేతులు చాపలేదు. 

తుంగతుర్తిలో మందుల సామేలే ఉంటాడు ఖబర్దార్. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఎందుకు చేరాడో సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ సోనియా గాంధీని రాజగోపాల్ తిట్టాడు. పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి నికార్సైన కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు. తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల గురించి మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు. ముందు మీ నియోజకవర్గాల సంగతి చూసుకోండి’ అంటూ విమర్శించారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)