Breaking News

నాగార్జునసాగర్ బరి నుంచి జానారెడ్డి అవుట్‌

Published on Thu, 08/24/2023 - 17:47

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కుందూరు జానారెడ్డి ఇక ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పినట్లేనా?. ఎప్పటి నుంచో తన వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని కలలు కంటున్న జానారెడ్డి.. ఆ వ్యూహంలో భాగంగా తన చిన్న కుమారుడిని రంగంలోకి దించారు. నాగార్జున సాగర్‌ నుంచి జానారెడ్డి చిన్న కొడుకు జైవీర్ రెడ్డి పోటీ కోసం దరఖాస్తు చేసుకోవడంతో.. ఈసారి ఎన్నికలకు జానారెడ్డి దూరమైనట్లే భావించొచ్చు.

చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి గిరిజన చైతన్య యాత్ర పేరుతో జనాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. పెద్దవూర మండలం  గేమ్యా నాయక్ తండా నుంచి పాదయాత్రను మొదలు పెట్టిన జైవీర్రెడ్డి..  తనతండ్రి జానారెడ్డి హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ సాగారు. అయితే.. ఉన్నట్లుండి జైవీర్ రంగంలోకి రావడం వెనుక భారీ వ్యూహమే ఉందని తెలుస్తోంది.

గతంలో గిరిజన తండాలు కాంగ్రెస్‌కు పెట్టని కోటలా ఉండేవి. కానీ కేసీఆర్ ప్రభుత్వం చిన్న చిన్న తండాలను కూడా గ్రామ పంచాయితీలుగా మార్చడంతో మెజార్టీ తండాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే సర్పంచులుగా ఉన్నారు. దీంతో గిరిజనుల మద్దతును మరోసారి కూడగట్టేందుకు యాత్రను ఉపయోగించుకుంటున్నారని టాక్‌.

కాంగ్రెస్‌ పార్టీ తరపున అభ్యర్థుల దరఖాస్తుకు రేపే ఆఖరి రోజు.   పీసీసీకి ఇప్పటిదాకా 600 అప్లికేషన్లు వచ్చాయి. ఇవాళ రేవంత్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య దరఖాస్తు చేసుకోగా.. పొంగులేటి, కొమటిరెడ్డి, కొండాసురేఖలు ఇప్పటికే అప్లికేషన్లు సమర్పించారు. ఉత్తమ్‌, భట్టి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. 
చదవండి: గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించిన హైకోర్టు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)