Breaking News

కేసీఆర్‌కు ఒవైసీ అంటే భయం: సీఎం యోగి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Published on Sat, 11/25/2023 - 15:39

సాక్షి, వేములవాడ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ స్పీడ్‌ పెంచింది. జాతీయ నేతలు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వేములవాడలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ‍క్రమంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలపై విరుచుకుపడ్డారు. 

వేములవాడలో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో సీఎం యోగి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. అందుకే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసింది. కేసీఆర్‌కు మజ్లీస్‌ నేత ఒవైసీ అంటే భయం. అందుకే విమోచన దినోత్సవాన్ని నిర్వహించడంల లేదు. నీళ్లు, నిధులు, నియామకాలు ఏవీ నెరవేరలేదు. 

బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ ప్రజల కలలను సాకారం చేయకపోగా ఆ కలలను నిర్వీర్యం చేసేశారు. అవినీతి, కుటుంబపాలనతో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోపిడీ చేసింది. బీజేపీ ప్రభుత్వం వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి అవి ఇతర వెనుకబడిన వర్గాలకు కేటాయిస్తాం. మిగులు ఆదాయంతో ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చేశారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా నేటి తెలంగాణ పరిస్థితే గతంలో ఉండేది. కానీ, ఇప్పుడు యూపీలో పూర్తిగా ఆ పరిస్థితి మారిపోయింది. ఆరేళ్లల్లో నిరుద్యోగాన్ని పారద్రోలాం, రైతులకు ఎన్నోరకాల మేలు చేశాం, పీడిత వర్గాలకు అండగా నిలిచాం. తెలంగాణాలో కూడా అలాంటి పరిస్థితి రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే.

డబుల్ ఇంజన్ సర్కారుంటే మోదీ విజన్ ప్రకారం ఓవైపు దేశంలో, మరోవైపు రాష్ట్రంలో రెండుచోట్లా అభివృద్ధి జరుగుతుంది. ప్రపంచంలో భారతదేశం గొప్పతనాన్ని చాటడంతో పాటు, భద్రతాపరంగా కూడా భారత్‌ను దృఢంగా నిల్పిన ఘనత మోదీది. ఇవాళ బీజేపీ వచ్చాక సమానత్వంతో పాటు.. మౌలిక సదుపాయలతో కూడిన సమ్మిళిత అభివృద్ధికి బీజం పడింది. సీహెచ్ విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్‌గా, కేంద్రమంత్రిగా ఎలాంటి సేవలందించారో మీకు తెలుసు. వేములవాడ వికాసం కోసం ఆయన కుమారుడు డాక్టర్ చెన్నమనేని వికాస్‌ను గెలిపించాలి. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతోంది. మీరంతా అయోధ్యకు ఉచితంగా రావాలని కోరుతున్నాను’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)