బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్
Breaking News
TS: మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్రెడ్డి
Published on Sat, 12/30/2023 - 15:34
సాక్షి,హైదరాబాద్: విధి నిర్వహణలో నాలుగు నెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి రూ.2లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం ఆర్థిక సాయం అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2లక్షల చెక్ ను శనివారం సచివాలయంలో బాధిత కుటుంబానికి అందించారు.
ఈ నెల 23న గిగ్ వర్కర్లతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నాలుగు నెలల క్రితం ఫుడ్ డెలివరీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తుందని తాను ఎదురు చూశానని, కానీ బీఆరెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పారు.
మృతి చెందిన డెలివరీ బాయ్ కుటుంబ వివరాలు తెలుసుకుని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2లక్షలు ఆ కుటుంబానికి అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కేవలం వారం రోజుల్లో అధికారులు ఆ కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. శనివారం బాధిత స్విగ్గీ బాయ్ కుటుంబాన్ని సచివాలయానికి పిలిపించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ కుటుంబానికి రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ముఖ్యమంత్రి తమ వివరాలు కనుక్కుని మరీ సాయం చేయడంపై ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.
ఇదీచదవండి..తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం
Tags : 1