Breaking News

Delhi: రేఖా గుప్తా క్యాబినెట్‌ మంత్రులలో ఎవరి విద్యార్హతలేమిటి?

Published on Thu, 02/20/2025 - 11:33

న్యూఢిల్లీ: బీజేపీ మహిళా నేత, ఎమ్మెల్యే రేఖా గుప్తా(Rekha Gupta) ఈరోజు(ఫిబ్రవరి 20) ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో నేడు ఆరుగురు మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని పేర్కొన్నారు. కొత్త సీఎం రేఖ గుప్తా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నవారి విద్యార్హతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎమ్మెల్యే ప్రవేశ్ వర్మ 
ప్రవేశ్‌ ఎంబీఏ పూర్తి చేశారు. ఈయన ఢిల్లీకి చెందినవారు. ఆయన తండ్రి సాహిబ్ సింగ్ వర్మ కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రవేశ్ వర్మ(Pravesh Verma) తన ప్రాథమిక విద్యను ఢిల్లీలోని ఆర్కే పురంలో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో పూర్తి చేశారు. తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరి మాల్ కళాశాల నుంచి బి.కామ్ చేశారు. అనంతరం ఢిల్లీలోని ఫర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి ఎంబీఏ పట్టా పొందారు.

ఎమ్మెల్యే ఆశిష్ సూద్ 
ఆశిష్ సూద్ బి.కామ్‌ పూర్తి చేశారు. జనక్‌పురి ఎమ్మెల్యే ఆశిష్ సూద్ కూడా క్యాబినెట్‌లో స్థానం దక్కించుకున్నారు. ఆశిష్ సూద్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆత్మ రామ సనాతన ధర్మ కళాశాల నుండి బి.కామ్ పూర్తి చేశారు. ఈ సమయంలో ఆయన విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా 
సిర్సా 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆయనను  అత్యంత ధనిక ఎమ్మెల్యే అని చెబుతుంటారు. మజీందర్ సింగ్(Majinder Singh) హర్యానాలోని సిర్సా నివాసి. ఆయనకు సిర్సాలో రూ.248 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.

ఎమ్మెల్యే రవీందర్ సింగ్ 
రవీందర్ సింగ్ బిఎ పాసయ్యారు. పట్పర్‌గంజ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అధ్యాపకుడు అవధ్ ఓజాను ఓడించారు. రవీందర్ సింగ్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. పట్టా పొందారు.  రవీందర్‌కు మంత్రివర్గంలో చోటు లభించింది.

కపిల్ మిశ్రా 
కపిల్ మిశ్రా పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ చేశారు. సోషల్ వర్క్‌లో ఎంఏ చేశారు. ఈయన గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత బీజేపీలో చేరారు.

పంకజ్ కుమార్ సింగ్ 
పంకజ్ కుమార్ వృత్తిరీత్యా దంతవైద్యుడు. బీహార్‌లోని బుద్ధగయలోని మగధ్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్‌) పూర్తిచేశారు. వికాస్‌పురి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన కొత్త ప్రభుత్వంలో మంత్రి కాబోతున్నారు.

ఇది కూడా చదవండి: Delhi: కొత్త సీఎం రేఖా గుప్తాకు రూ. 501.. ఎందుకంటే?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)