Breaking News

రాయి ఏంటో, రత్నమేదో గుర్తించి ఓటు వేయండి: సీఎం కేసీఆర్‌

Published on Sun, 10/15/2023 - 17:53

సాక్షి, సిద్ధిపేట: తెలంగాణ రాక ముందు దారుణ పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్‌ వన్‌ స్థాయికి చేరిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. హుస్నాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ రైతులకు కరెంట్‌ కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి అప్పుడు ఉండేదని, ఇవాళ తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌ వన్‌ ఉందన్నారు.

‘‘పచ్చదనం, పారిశుధ్యంలో తెలంగాణ నెంబర్‌ వన్‌. వలసలు, కరెంట్‌ కోతలతో ఇబ్బంది పడ్డాం. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం ఎలా ఉందో ఆలోచించండి. పారిశ్రామిక విధానంలో మనమే నంబర్‌వన్‌గా ఉన్నాం. ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు ప్రయత్నించినా అన్నీ పూర్తి చేసుకున్నాం. ఎన్నికలొస్తే పార్టీలు ఏవేవో మాట్లాడుతుంటాయి’’ అంటూ కేసీఆర్‌ మండిపడ్డారు.

‘‘పెన్షన్లు ఎందుకివ్వాలని ఆలోచించాం. పనిచేసుకోలేని వారికి అండగా నిలచే ఉద్దేశంతోనే పెన్షన్లు ఇస్తున్నాం. ఒంటరి మహిళలు, వికలాంగులకు ఆర్థిక భరోసా కోసమే పెన్షన్లు
ఓట్ల కోసం పెన్షన్లు ఇస్తామని ఎప్పుడూ మేం చెప్పలేదు. దశల వారీగా పెన్షన్లు పెంచుకుంటూ వస్తాం. ఓట్ల కోసం పెన్షన్లు ఇస్తామని ఎప్పుడూ మేం చెప్పలేదు. రైతు బంధుతో అన్నదాతలకు అండగా ఉంటున్నాం. రైతుబంధు సాయం ఇంకా పెంచాలని నిర్ణయించాం’’ సీఎం తెలిపారు.

‘‘ఒక్కొక్క ప్రాజెక్టునూ పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. రైతు ఇవాళ కంటి నిండా నిద్ర పోతున్నాడు. మిషన్‌ భగీరథ లాంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఆడబిడ్డ బిందె పట్టుకుని రోడ్డు మీద నిలబడే పరిస్థితికి ముగింపు పలికాం. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది. రాయి ఏంటో, రత్నమేదో గుర్తించి ఓటువేయాలి. స్పష్టమైన అవగాహనతో ఓటు వేస్తే ప్రజలు గెలుస్తారు’’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.
చదవండి: బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో.. కేసీఆర్‌ హామీలివే.. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)