ఆ మర్మం ఏందో?.. స్మితా సబర్వాల్‌కు సీఎం సీపీఆర్వో కౌంటర్‌ ట్వీట్‌

Published on Sat, 04/19/2025 - 19:36

సాక్షి, హైదరాబాద్‌: కంచ గచ్చిబౌలి ఘటనలో తెలంగాణ ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్‌పై  సీఎం సీపీఆర్వో కౌంటర్ ట్వీట్ చేశారు. ‘‘ఆ ఐఏఎస్‌ అధికారి “దృష్టికోణం”లో మార్పు ఎందుకొచ్చినట్టు?. అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలూ మారొచ్చా?’’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

‘‘అప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికేయించిన, వన్యప్రాణులను తరిమిన (సీఎంవోలో ఇరిగేషన్‌ బాధ్యతలు నిర్వహించిన) వీరే.. అప్పుడు కనిపించని తప్పు.. ఇప్పుడు తప్పు పట్టడంలో మర్మం ఏందో?.. అసలు ఏడుపు వన్య ప్రాణుల కోసమా? అధికారం కోల్పోయిన వారి కోసమా?’ అంటూ సీపీఆర్వో ట్వీట్‌ చేశారు.

కాగా, స్మితా సబర్మాల్‌ శనివారం గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించిన ఆమె సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్టుకుగానూ నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఇవాళ గచ్చిబౌలి పీఎస్‌లో ఆమె విచారణకు హాజరై స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఆపై తన ఎక్స్‌ ఖాతాలో ఓ సందేశం ఉంచారు.

‘‘చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చా. పోలీసులకు పూర్తిగా సహకరించా. నేను ఎలాంటి పోస్ట్‌ చేయలేదు. హాయ్‌ హైదరాబాద్‌ పోస్టును రీట్వీట్‌ చేశా.  2 వేల మంది అదే పోస్ట్‌ను షేర్‌ చేశారు. వాళ్లందరితోనూ ఇలాగే వ్యవహరిస్తారా?. ఇలాగే నోటీసులు ఇచ్చి వారందరిపై ఇలాగే చర్యలు తీసుకుంటారా?.  అలా చేయకపోతే కొంతమందినే టార్గెట్‌ చేసినట్లు అవుతుంది. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు అవుతుంది. ఇది ఎంత వరకు కరెక్ట్‌?. జస్టిస్‌ అనేది అందరికీ సమానంగా ఉండాలి. చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్‌ చేస్తున్నారా?’’ అని ట్వీట్‌ చేశారు.
 

 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)