Breaking News

చొప్పదండి ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయ చరిత్ర

Published on Sat, 07/29/2023 - 16:48

చొప్పదండి (ఎస్సి) నియోజకవర్గం

చొప్పదండి రిజర్వుడ్‌ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్ది సాంకే రవిశంకర్‌ 42127ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. ఆయన తన సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ధి మేడిపల్లి సత్యంపై గెలిచారు. ఇక్కడ 2014లో  టిఆర్‌ఎస్‌ పక్షాన ఎన్నికైన బొడిగె శోభకు టిక్కెట్‌ ఇవ్వకుండా కొత్తగా రవిశంకర్‌ కు కేటాయించారు.దీనికి నిరసనగా శోభ బిజెపిలో చేరి పోటీచేసినా ఫలితం దక్కలేదు. ఆమెకు 15600 ఓట్లు మాత్రమే వచ్చాయి.కాగా గెలిచిన రవిశంకర్‌ కు 91090 ఓట్లు రాగా, మేడిపల్లి సత్యం కు 48963 ఓట్లు వచ్చాయి.

చొప్పదండి రిజర్వుడ్‌ నియోజకవర్గం నుంచి సీనియర్‌ నేత ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య 2009లో టిడిపి పక్షాన గెలిచారు. అంతకుముందు రెండుసార్లు నేరెళ్ల నుంచి టిడిపి తరపునే గెలిచారు. 2014లో దేవయ్య  టిడిపికి గుడ్‌ బై చెప్పి కాంగ్రెస్‌ ఐలో చేరినా ఫలితం దక్కలేదు. టిఆర్‌ఎస్‌ తరపున తొలిసారి పోటీచేసిన మహిళ అభ్యర్ధి బొడిగె శోభ చేతిలో దేవయ్య 54981 ఓట్ల తేడాతో ఓడిపోయారు.2014లో చొప్పదండిలో  టిడిపి, బిజెపి కూటమి అభ్యర్ధి మేడిపల్లి సత్యం 13104 ఓట్లతో  మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ ఐలో చేరి పోటీచేసి మరోసారి ఓటమి చెందారు.

చొప్పదండి రిజర్వు అయ్యేవరకు జరిగిన ఎన్నికలలో ఐదుసార్లు రెడ్లు,ఒకసారి వెలమ, రెండుసార్లు బిసిలు ఒకసారి ఇతరులు గెలుపొందారు.1983 నుంచి 2009 వరకు   చొప్పదండిలో ఒక్క 1999లో మాత్రమే కాంగ్రెస్‌  ఐ గెలిచింది.  చొప్పదండి నియోజకవర్గానికి 12 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ ఐ లు కలిసి మూడుసార్లు, టిడిపి ఆరుసార్లు, టిఆర్‌ఎస్‌ రెండుసార్లు,  పిడిఎఫ్‌ ఒకసారి గెలిచాయి.  ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిచిన న్యాలకొండ రామ్‌కిషన్‌రావు కొంతకాలం చంద్రబాబు క్యాబినెట్‌లో సభ్యునిగా కూడా ఉన్నారు. దేవయ్య కూడా చంద్రబాబు క్యాబినెట్‌లో పనిచేసారు. 1957లో చొప్పదండిలో పిడిఎఫ్‌ పక్షాన గెలిచిన చెన్నమనేని రాజేశ్వరరావు ఆ తరువాత సిరిసిల్ల నుంచి నాలుగుసార్లు సిపిఐ అభ్యర్ధిగా, ఒకసారి టిడిపి తరుఫునగెలిచారు.

చొప్పదండి (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)