Breaking News

అరచేతిలో బొంగరం తిప్పిన ఛత్తీస్‌గఢ్‌ సీఎం: ప్రత్యర్థులకు సవాలేనా?

Published on Thu, 10/26/2023 - 14:21

ఛత్తీస్‌గఢ్  ముఖ్యమంత్రి  భూపేశ్ భగేల్  ప్రత్యేకతే వేరు.  ప్రత్యర్థులను తనదైన పంచ్‌లతో తిప్పి కొట్టడం ఈ కాంగ్రెస్‌ సీనియర్‌నేతకు బాగా అలవాటు. దీపావళి సందర్భంగా ప్రజల సంక్షేమం కోసం కొరడా దెబ్బలు తిన్నా, ఇటీవల కీలక సమావేశంలో కాండ్రీ క్రష్‌ ఆడినా ఆయనకే చెల్లు. తాజాగా బొంగరం తిప్పుతూ వార్తల్లో నిలిచారు.  దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో నెటిజన్లును ఆకట్టుకుంటోంది.  దీంతో బొంగరం తిప్పినంత ఈజీగా ఈ సారి కూడా రాజకీయాల్లో చక్రం తిప్పుతారా అంటూ నెటిజన్లు కమెంట్‌ చేశారు.

ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్‌ దేశాయ్‌ దీనికి సంబంధించిన ఒక వీడియోను ఎక్స్‌( ట్విటర్‌)లో షేర్‌ చేశారు. అలా విసిరి.. ఇలా అలవోకగా అరచేతిలో బొంగరం తిప్పుతూ ప్రత్యర్థులకు పరోక్షంగా సవాల్‌ విసురుతున్నట్టే కనిపించారు. దీంతో ‘వారెవ్వా.. లట్టూ  మాస్టర్‌... డౌన్‌ టూ ఎర్త్‌ పోలిటీషియన్‌’ అంటూ సీఎంను రాజ్‌దీప్‌ అభివర్ణించారు.

కాగా  2023  ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ  ఎన్నికలు  రెండు దశల్లో జరగనున్నాయి.  రాబోయే ఎన్నికల్లో  కూడా తన సత్తా చాటుకునేందుకు  భూపేష్ భగెల్ సర్వ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.  ముఖ్యంగా రైతులే నిర్ణయాత్మక అంశం అని, వారి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలు తమకు విజయాన్ని అందిస్తాయనే విశ్వాసాన్ని ప్రకటించారు. అధికార కాంగ్రెస్ 90లో 75 ప్లస్ సీట్లు గెలుచు కుంటుందనే ధీమా వ్యక్తం చేశారు భూపేష్ బఘేల్. సీఎం పటాన్ నుంచి, డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవో అంబికాపూర్ నుంచి పోటీ చేయనున్నారు.  అటు రాష్ట్ర అసెంబ్లీ పోల్స్ కి సంబంధించి మొత్తం 90 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. ఆ క్రమంలో  నలుగురు అభ్యర్థులతో కూడిన చివరి జాబితాను బీజేపీ బుధవారం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)