Breaking News

ఆధార్‌ను తొలగిస్తున్న కేంద్రం: మమత

Published on Mon, 02/19/2024 - 06:21

సూరి: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆధార్‌ కార్డులను డీయాక్టివేట్‌ చేస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు అందనివ్వడం లేదని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తమ ప్రభుత్వం ఆధార్‌ కార్డుతో పనిలేకుండానే సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. బిర్భూమ్‌ జిల్లా సూరిలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం మమత మాట్లాడారు. ‘జాగ్రత్తంగా ఉండండి. కేంద్ర ప్రభుత్వం బెంగాల్‌లోని చాలా జిల్లాల్లో ఆధార్‌ కార్డులను డీయాక్టివేట్‌ చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉచిత రేషన్, లక్షీభండార్‌ వంటి పథకాలను ప్రజలకు అందకుండా చేసేందుకు ఇలాంటి చర్యలకు దిగుతోంది.

ఆధార్‌ లేదనే కారణంతో పథకాలను ప్రజలకు అందకుండా నిలిపివేయవద్దని అధికారులను ఆదేశించాను. బెంగాల్‌ ప్రజలు భయపడొద్దు. మీకు అండగా నేనున్నాను’ అన్నారు. ఆధార్‌ కార్డుల తొలగింపు వెనుక కుట్ర ఉందని తెలిస్తే ఒక్క కూడా దాన్ని లింక్‌ చేయడానికి అనుమతించబోనన్నారు. ఆధార్‌ కార్డులు తొలగించిన వారి వివరాలతో పోర్టల్‌ను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆధార్‌ కార్డులు లేని కారణంగా బ్యాంకులు లావాదేవీలను నిరాకరించినట్లయితే సహకార బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల సేవలను వాడుకోవాలని ప్రజలకు ఆమె సూచించారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి