Breaking News

బండి సంజయ్‌ని కలిసిన చీకోటి ప్రవీణ్

Published on Thu, 08/03/2023 - 20:38

సాక్షి, ఢిల్లీ: చికోటి ప్రవీణ్.. తెలంగాణలో సంచలనం సృష్టించిన పేరు. విదేశాల్లో అక్రమ క్యాసినో నడిపించిన వ్యవహారంలో ఫెమా నిబంధనల ఉల్లంఘన, హవాలా చెల్లింపులపై ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ప్రవీణ్‌.. అటుపై నిబంధనలకు విరుద్ధంగా కొన్ని జంతువుల్ని పెంచుకున్నాడనే అభియోగాలు సైతం ఉన్నాయి. ఈ క్రమంలో గతకొంతకాలంగా రాజకీయాల్లోకి వస్తాడంటూ జరుగుతున్న ప్రచారానికి తాజా పరిణామాలు మరింత ఊతం ఇచ్చాయి. 

చికోటి ప్రవీణ్‌ రాజకీయాల్లోకి వస్తాడనే ప్రచారానికి బలం చేకూర్చేలా ఇవాళ కొన్ని పరిణామాలు జరిగాయి. బీజేపీలో చేరొచ్చనే సంకేతాలు ఇస్తూ.. గురువారం ఢిల్లీలో కొందరు తెలంగాణ బీజేపీ నేతలను కలిశాడు ప్రవీణ్‌. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణలను కలిశాడు. వాళ్లకు శాలువా కప్పి సత్కరించాడు. వీళ్లతో పాటు తాజాగా బీజేపీలో చేరిన జయసుధను సైతం ప్రవీణ్‌ కలిశాడు. 

బీజేపీలో చేరడానికి లైన్ క్లియర్ చేసుకునే క్రమంలోనే వీళ్లందరినీ కలుస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అయితే ఇక్కడి నేతలను ఢిల్లీ వెళ్లి మరీ కలవడం గమనార్హం. ఇక.. వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతున్న వ్యక్తి, పైగా ఈడీలాంటి దర్యాప్తు సంస్థ విచారణ ఎదుర్కొంటున్న ప్రవీణ్‌ను బీజేపీ అక్కున చేర్చుకుంటుందా? తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)