Breaking News

ములుగు (ఎస్టి) నియోజకవర్గం గెలిచిన‌ అభ్య‌ర్థులు వీరే...

Published on Fri, 08/11/2023 - 12:28

ములుగు (ఎస్టి) నియోజకవర్గం

ములుగు గిరిజన రిజర్వుడ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీచేసిన దళవాయి అనసూయ ఉరఫ్‌ సీతక్క రెండోసారి గెలిచారు. 2009లో  ఆమె టిడిపి పక్షాన ఒకసారి గెలవగా, 2018లో కాంగ్రెస్‌ ఐలో చేరి విజయం సాదించారు. అనసూయ తన సమీప టిఆర్‌ఎస్‌ ప్రత్యర్ది, అప్పటి  మంత్రి ఎ.చందూలాల్‌ పై 22671 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. సీతక్కకు 88971 ఓట్లు రాగా, చందూలాల్‌కు 66300 ఓట్లు వచ్చాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్దిగా పోటీచేసిన బి.లక్ష్మీనారాయణకు సుమారు 3500 ఓట్లు వచ్చాయి.

2014లో ములుగు నుంచి టిఆర్‌ఎస్‌ పక్షాన చందూలాల్‌ గెలిచారు. ఆయన మూడుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. గతంలో ఆయన టిడిపి నేతగా ఉండేవారు.  2014లో ఇక్కడ తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్యను 16399 మెజార్టీతో ఓడిరచారు. అప్పట్లో  సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న టిడిపి నేత దళవాయి అనసూయ(సీతక్క) మూడోస్థానానికి పరిమితం అయ్యారు. అయితే ఆమె 2018లో కాంగ్రెస్‌ ఐ పక్షాన గెలిచారు. కాగా కాంగ్రెస్‌ ఐ మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్య భద్రాచలానికి మారి మూడోసారి విజయం సాదించడం విశేషం.

ములుగులో కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ కలిసి ఎనిమిదిసార్లు, టిడిపి నాలుగుసార్లు, టిఆర్‌ఎస్‌ ఒకసారి పిడిఎఫ్‌ రెండుసార్లు గెలిచాయి. ఒక ఇండిపెండెంటు కూడా నెగ్గారు. ఇక్కడ మూడుసార్లు గెలిచిన జగన్నాయక్‌ మంత్రి పదవి కూడా నిర్వహించారు. అజ్మీరా చందూలాల్‌ ఇక్కడ నుంచి మూడుసార్లు  గెలిచి కొంత కాలం ఎన్‌.టిఆర్‌ క్యాబినెట్‌లో ఉన్నారు. తదుపరి 2014  ఎన్నికలలో గెలిచిన  తర్వాత  కెసిఆర్‌ క్యాబినెట్‌లో ఉన్నారు.

రెండుసార్లు టిడిపి తరుపున లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. 2009లో  ఆయన టిఆర్‌ఎస్‌ పక్షాన మహబూబాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయారు. తిరిగి 2014లో ములుగులో మూడోసారి గెలుపొందారు. 2009లో గెలిచిన సీతక్క కొంత కాలం నక్సల్స్‌ కార్యకలాపాలలో కూడా చురుకుగా పాల్గొని ఆ తర్వాత ఆ పంధాను వీడి టిడిపిలో చేరారు. 2018లో మరోసారి కాంగ్రెస్‌ ఐ నుంచి గెలిచారు.

ములుగు (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)