Breaking News

అనిల్ ఆంటోని గెలుపు సాధ్యమేనా.. బీజేపీ వ్యూహం అదేనా?

Published on Tue, 04/16/2024 - 07:10

తిరువనంతపురం: సార్వత్రిక ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల్లో పోటీచేయనున్న అభ్యర్థులు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరిన 'అనిల్ కె ఆంటోనీ' కూడా ప్రజలవద్దకు చేరుకుంటున్నారు.

కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని బీజేపీలో చేరడం తనను తీవ్రంగా బాధించిందని ఏకే ఆంటోని గతంలోనే పేర్కొన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా, సుదీర్ఘ కాలం రక్షణ మంత్రిగా ఉన్న ఎకె ఆంటోనీ వల్ల అనిల్ కే ఆంటోనీ గొప్ప ఇమేజ్ లభించింది. ఇమేజ్ ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో గెలుస్తాడని నమ్మకం లేదని పలువురు భావిస్తున్నారు.

అభివృద్ధి కోసం ఎదురుచూసే యువతను తనవైపు తిప్పుకోవడంతో పాటు, ప్రత్యర్థుల ప్రతికూల అంశాలను ఉపయోగించుకుని గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని, అనిల్‌ను తక్కువ అంచనా వేయకూడదని పతనంతిట్టలో కొందరు భావిస్తున్నారు. 

కేరళలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే పలు ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. అంతేకాకుండా 2019లో శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదం కారణంగా బీజేపీ ఓట్ల శాతం అంతకు ముందుకంటే రెండు రెట్లు పెరిగింది.

ఏకే ఆంటోనీ పలుకుబడిని ఉపయోగించుకుని సీబీఐ స్టాండింగ్ కౌన్సెల్ నియామకానికి అనిల్ మధ్యవర్తి నుంచి లంచం తీసుకున్నాడనే ఆరోపణలు ఊపందుకున్న సమయంలో.. తన తండ్రి లాంటి చాలా మంది కాంగ్రెస్ నేతలు కాలం చెల్లిపోయి కుక్కల్లా ఉన్నారని అనిల్ చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలు సంచనలం రేపాయి. 

పతనంతిట్టలో క్రైస్తవుల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో క్రైస్తవులలో గణనీయమైన ప్రభావం ఉన్న జోస్ కే మణి నేతృత్వంలోని కేరళ కాంగ్రెస్ ఇప్పుడు సీపీఎం సంకీర్ణ భాగస్వామిగా ఉన్నందున సీపీఎం కూడా ఈసారి క్రైస్తవ ఓటు బ్యాంకుల్లోకి రావాలని భావిస్తోంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)