Breaking News

రెచ్చిపోయిన మరో టీడీపీ ఎమ్మెల్యే.. ఫారెస్ట్‌ వాహనాన్ని లాక్కుని..

Published on Wed, 08/20/2025 - 17:06

సాక్షి, నంద్యాల జిల్లా: అధికార పార్టీ ఎమ్మెల్యేలు వరుస వివాదాలతో వార్తల్లో కెక్కుతున్నారు. ఉపేక్షించబోనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరిస్తున్నా.. నారా లోకేష్‌ అండతో చెలరేగిపోతున్నారు. తాజాగా.. శ్రీశైలం శిఖరం చెక్‌ పోస్ట్‌ వద్ద ఫారెస్ట్‌ వాహనాన్ని ఆపి తమపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారంటూ ఫారెస్ట్‌ సిబ్బంది ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

ఎమ్మెల్యే దాడి విషయాన్ని ఫారెస్ట్‌ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫారెస్ట్‌ వాహనాన్ని ఎమ్మెల్యే తానే నడుపుతూ.. సిబ్బందిని వాహనంలో ఎక్కించుకెళ్లినట్లు సమాచారం. అర్ధరాత్రి 2 గంటల వరకు ఫారెస్ట్‌ సిబ్బందిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తిప్పినట్లు తెలిసింది.

ఫారెస్ట్‌ గార్డ్ గురవయ్యపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అనుచరులు దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మేం చెప్పినట్టు వినడం లేదని ఎమ్మెల్యే దాడి చేశారంటున్న ఫారెస్ట్‌ సిబ్బంది.. డిపార్ట్‌మెంట్‌ వాహనాన్ని కూడా ఎమ్మెల్యే లాక్కున్నారంటూ ఆరోపిస్తున్నారు. అటవీ శాఖ సిబ్బందిపై బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, అనుచరుల దాడిపై ఫారెస్ట్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేసింది.

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి దౌర్జన్యం

 

 

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)