Breaking News

ప్రజల ఆమోదం ఉంటే సీఎంకు భయం ఎందుకు?: ఎమ్మెల్సీ కవిత

Published on Fri, 12/13/2024 - 14:57

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై జీవో ఇచ్చారంటూ రేవంత్‌ సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. అధికార పార్టీది తెలంగాణ వాదం కాదు.. కాంగ్రెస్‌ వాదం అంటూ దుయ్యబట్టారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వారికి పార్టీ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవంటూ ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రేపు(శనివారం) మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు కవిత తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి పై దాడి జరిగింది. బీఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వర్గాలను సమానంగా చూశాం. ప్రజల ఆమోదం ఉంటే సీఎంకు భయం ఎందుకు?. విగ్రహం తయారు చేసే వరకు ఎందుకు రహస్యంగా ఉంచారు’’ అంటూ కవిత నిలదీశారు.

జాగృతి తరపున మేము ఎన్నో ఏళ్లుగా చేస్తున్నాము. మేధావుల అభిప్రాయం తీసుకుని మరింత దూకుడుగా ముందుకు వెళ్తాం. సీఎం రేవంత్ సంకుచిత తత్వంతో వ్యవహరిస్తున్నారు. మేము అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశాము. సోనియా దగ్గర మార్కుల కోసం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు. కాంగ్రెస్ కొత్తగా చేసింది ఒక్క తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమే. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇది పిరికి ప్రభుత్వం. కార్యకర్తల నుంచి నేతల వరకు అక్రమ కేసులు పెడుతోంది. మేము అక్రమ కేసులకు భయపడం’’ అని కవిత చెప్పారు.

ఇదీ చదవండి: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై కేటీఆర్‌ కామెంట్స్‌

 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)