Breaking News

లగచర్ల ఘటన కుట్ర కాదు.. తిరుగుబాటు: పైలట్‌ రోహిత్‌రెడ్డి

Published on Sat, 11/16/2024 - 16:02

సాక్షి,హైదరాబాద్‌:లగచర్ల ఘటన రైతుల బాధతో జరిగిన తోపులాటే కానీ కుట్ర కానే కాదని బీఆర్‌ఎస్‌ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి అన్నారు. శనివారం(నవంబర్‌ 16) ఈ విషయమై రోహిత్‌రెడ్డి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.‘లగచర్ల గ్రామం చుట్టుపక్కల  పచ్చని పంటపొలాలు,అధిక దిగుబడినిచ్చే పంట పొలాలు ఉన్నాయి.

ప్రభుత్వం మొండితనంతో ముందుకు వెళ్తోంది. దాడి జరిగిన రోజు కలెక్టర్‌కు పోలీసులు భద్రత ఎందుకు కల్పించలేదు. బాధతో తిరగబడితే రైతులపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదు. కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ఆ సంఘటన జరిగిన రోజు అక్కడ లేడు. నరేందర్ రెడ్డిని కుట్రతోనే జైల్లో వేశారు.

బీఆర్‌ఎస్‌ సర్కార్ గతంలో 14 వేల ఎకరాల భూమిని ఫార్మా సిటీకి కేటాయించింది. మళ్ళీ ఇప్పుడు ఫార్మాసిటీకి కొత్తగా భూసేకరణ ఎందుకు.జిల్లాకు పెద్ద దిక్కు అని చెప్పుకుంటున్న పట్నం మహేందర్ రెడ్డి ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదు? నరేందర్ రెడ్డి జైలుకి వెళ్ళడం వెనుక మహేందర్ రెడ్డి హస్తం ఉంది.నరేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి.పట్నం కుటుంబంపై నిజంగా మహేందర్‌రెడ్డికి ప్రేమ ఉంటే ఎమ్మెల్సీ పదవికి,చీఫ్ విప్ పదవికి రాజీనామా చేయాలి’అని రోహిత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

ఇదీ చదవండి: కేసీఆర్‌ను ఫినిష్‌ చేస్తా అన్న వాళ్లే ఫినిష్‌ అయ్యారు 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)