Breaking News

సీఎంపై హత్యాయత్నానికి సూత్రధారి ‘బొండా’నే

Published on Sat, 04/20/2024 - 04:50

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడసెంట్రల్‌): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై, తనపై హత్యాయత్నానికి సూత్ర­దారి టీడీపీ నాయకుడు బొండా ఉమానే అని వైఎస్సార్‌సీపీ సెంట్రల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు.

ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, డెప్యూటీ మేయర్‌ అవుతు శ్రీశైలజతో కలిసి విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ పరిధిలోని 28వ డివిజన్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పథకం ప్రకారమే సీఎం జగన్‌పై టీడీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారని, బొండా ఉమా, ఏ2 దుర్గారావులు దగ్గరుండి మాపై హత్యాయత్నం చేయించారని ఆరోపించారు. దీనికి సూత్రధారి బొండా ఉమా కాగా, మూలకారకుడు చంద్రబాబేనని ఆరోపించారు.

ఈ కేసుకు సంబంధించిన అంశాలన్నీ బొండా ఉమా చుట్టూనే తిరుగుతున్నాయని, రాజకీయంగా తమను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక ఇలా టీడీపీ నాయకులు రౌడీయిజం, గూండాయిజాన్ని పోషించి హత్యాయత్నాలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. బొండా ఉమాకు నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, ఉమా ఘోర ఓటమిని చవిచూడడం తథ్యమన్నారు.   

నిందితులు ఎందుకు టచ్‌లో ఉన్నట్టు?  
ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగితే పోలీసు అధికారులు విచారణ జర­పడం తప్పా? అధికారులను బెదిరిస్తే నిజం అబద్దమవదనే విషయాన్ని బొండా ఉమా తెలుసుకోవాలని వెలంపల్లి హితవు­పలికారు. చట్టం ముందు అందరూ సమానులేనని, చట్టం తనపని తాను చేసుకువెళుతుంటే బొండా ఉమాకు ఎందుకు వెన్నులో వణుకు పుడుతోందని ప్రశ్నించారు. సీఎం జగనన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా­ర్టీలను ఉన్నత స్థానాల్లో కూర్చోబెడుతుంటే.. చంద్రబాబు వారిని రౌడీలుగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు.

ఎవరైనా తమ మీద తామే దాడి చేయించుకుంటారా? దాడి ఘటనలో కన్నుకు దెబ్బ తగిలి ఇబ్బంది పడుతుంటే బొండా ఉమాకు కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా దు్రష్పచారం చేయడం దుర్మా­ర్గమన్నారు. ‘సీఎంపై హత్యాయత్నం చేసినవారు బొండా ఉమాతో ఎందుకు టచ్‌లో ఉన్నారు? సతీష్‌ తల్లిదండ్రులు బొండా ఉమా ఇంటికి ఎందుకు వెళ్లారు?’ అని ప్రశ్నించారు.

బొండా ఉమా, ఆయన ఇద్దరు కుమారులు చేస్తున్న రౌడీయిజానికి కచ్చితంగా అడ్డుకట్ట వేస్తామని హెచ్చరించారు. ఈ కేసులో ఏ2గా ఉన్న దుర్గారావు, బొండా ఉమా ఇద్దరు పక్కపక్కనే కూర్చొని ఈ దాడి చేయించారని ఆయన ఆరోపించారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని కోరారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)