Breaking News

బీజేపీలో మరో ట్విస్ట్‌.. రాజాసింగ్‌పై విజయశాంతి సంచలన ట్వీట్‌

Published on Fri, 06/30/2023 - 11:00

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో​ బీజేపీలో ముసలం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా స్థానిక నేతల మధ్య విభేదాల కారణంగా అధిష్టానం బీజేపీ నేతలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ సస్పెన్షన్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి.. కీలక వ్యాఖ్యలు చేశారు. 

తాజాగా విజయశాంతి.. రాజాసింగ్ సస్పెన్షన్‌పై ట్విట్టర్‌లో సంచలన పోస్ట్‌ చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ అంశంలో బీజేపీ నిర్ణయం కొంత ఆలస్యమవుతున్నట్లు మన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. అయితే, బండి సంజయ్ గారితో సహా తెలంగాణ రాష్ట్ర పార్టీ అంతా ఆ సస్పెన్షన్ తియ్యబడాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నామని వెల్లడించారు. అలాగే జరుగుతుందని నమ్ముతున్నాం. ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు, కార్యకర్తలు ఉన్న భారతీయ జనతా పార్టీ తన కార్యకర్తలకు న్యాయం చేసుకోకుంటే ఇంత శక్తి వస్తదా… సరైన సమయంలో అంతా మంచే జరుగుతుంది. 

కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా ఆదరించే బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి వ్యవహరిస్తుందన్నారు. ఆలస్యమైనట్లు కనిపించినా అంతిమ నిర్ణయం కచ్చితంగా అందరికీ మంచి చేసేదే అవుతుందని వివరించారు. ఇక, విజయశాంతి చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బీజేపీ కార్యకర్తలు ఆమె ట్వీట్‌పై స్పందిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: భయపడే వాళ్లు ఎవరూ లేరు.. ఒవైసీకి ఎమ్మెల్యే షకీల్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు