Breaking News

ఆ రెండూ ఎవరికో?

Published on Wed, 03/20/2024 - 05:14

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు గాను 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చే యగా..పెండింగ్‌లో ఉన్న వరంగల్, ఖమ్మం అభ్యర్థుల విషయంలో ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు. వరంగల్‌ ఎంపీ సీటు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు ఖరారైనట్టు సమాచారం. మరోవైపు ఖమ్మం సీటు కోసం పలువురు ప్రయత్నాలు చేస్తుండగా, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు పేరును నాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మంగళవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్‌ తివారీతో ఆయన సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ ఎంపీ ఖమ్మం టికెట్‌ కోసం ఢిల్లీస్థాయిలో పెద్దెత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో తాను టీడీపీలో ఉన్నందున, ఇప్పుడు ఏపీలో టీడీపీ–బీజేపీల మధ్య పొత్తు దృష్ట్యా, ఖమ్మంలో తనకు టీడీపీ శ్రేణులు సహకరిస్తాయని, తప్పకుండా గెలుస్తానంటూ బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించే ప్రయత్నాల్లో ఆయన నిమగ్నమైనట్టు చెబుతున్నారు. దీంతో ఖమ్మం విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.  

శానంపూడికి ఖాయమేనా? 
నల్లగొండ సీటును బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి ఇప్పటికే ప్రకటించారు. కానీ తనకు టికెట్‌ ఇస్తే అక్కడి నుంచి పోటీ చేసి గెలుస్తానంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఒకరు గట్టిగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలిసింది. దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థి ని మార్చడం కుదరదని కొందరు అంటుంటే, గెలుపు ఖాయమనుకుంటే అభ్యర్థి ని మార్చేందుకు నాయకత్వం వెనుకాడదని కొందరు అంటున్నారు. 22వ తేదీన జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పెండింగ్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించవచ్చునని పార్టీ నేతలు చెబుతున్నారు. 

23న అభ్యర్థులతో కిషన్‌రెడ్డి సమావేశం 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఈ నెల 23న పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. శనివారం నాటి కల్లా 17 స్థానాలకు అభ్యర్థులు ఖరారు అయ్యే అవకాశాలు ఉండడంతో వారితో ఈ భేటీ జరపనున్నట్టు సమాచారం. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)