Breaking News

రేపు బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ 

Published on Tue, 03/05/2024 - 03:12

సాక్షి, హైదరాబాద్‌:  బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం ఢిల్లీలో సమావేశం కానుంది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను ఇటీవల 9 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసిన తెలిసిందే. బుధవారం నాటి భేటీలో పెండింగ్‌లోని మిగతా 8 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల బలాబలాలపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు కసరత్తు పూర్తిచేశాయి. ఈ క్రమంలోనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న, ఏకాభిప్రాయం కుదిరిన 9 మందితో తొలి జాబితాను ప్రకటించారు.

టికెట్‌ కోసం పోటీ ఉన్న ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్‌ స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుందనే దానిపై కసరత్తు చేశారు. పార్టీ పరంగా అంతగా బలమైన నాయకులు లేని వరంగల్, నల్లగొండ, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్‌లలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నుంచి నేతల చేరికలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌కు చెందిన మరో సిట్టింగ్‌ ఎంపీ బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ సదరు ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించేయడంతో.. ఆయనను మరోసీటు నుంచి బరిలో దిగాల్సిందిగా బీజేపీ నాయకత్వం కోరినట్టు తెలిసింది. దీనిపై సదరు ఎంపీ పెద్దగా ఉత్సాహం చూపడం లేదని సమాచారం. అయితే సీట్లపై ప్రాథమిక కసరత్తు ముగిసిన నేపథ్యంలో.. కొన్ని కొత్తపేర్లు తెరమీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)