Breaking News

BJP: లోక్‌సభ పోటీపై పవన్‌ యూటర్న్‌

Published on Thu, 03/14/2024 - 07:46

లోక్‌సభ పోరు కోసం రెండు జాబితాల్ని విడుదల చేసిన బీజేపీ.. పాతవాళ్లలో కొందర్ని తప్పించి, కొత్తవాళ్లకు అవకాశం కల్పిస్తున్నది చూస్తున్నాం. తొలి జాబితాలో  సీటు దక్కినప్పటికీ తాను పోటీ చేయలేనంటూ మరుసటిరోజే ప్రకటించి ఒక్కసారిగా హాట్‌ టాపిక్‌గా మారారు భోజ్‌పుర్‌ నటుడు కమ్‌ సింగర్‌ పవన్‌ సింగ్‌. అయితే..ఇప్పుడు ఆయన యూటర్న్‌ తీసుకున్నారు.

ఎన్నికల్లో తాను పోటీకి సిద్ధమేనంటూ ప్రకటించారు. ‘‘నా తల్లికి ఇచ్చిన మాట నెరవేర్చేందుకు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నా.  ఇది నా సమాజం కోసం.. నా ప్రజల కోసం. ఇందుకు అందరి సహకారం, ఆశీస్సులు నాకు కావాలి’’ అంటూ ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారాయన. 

బీజేపీ ఫస్ట్‌లిస్ట్‌లో పశ్చిమ బెంగాల్‌లోని ఆసన్‌సోల్‌ టికెట్‌ను పవన్‌కు కేటాయించింది కమల అధిష్టానం. ఆ సమయంలో.. ‘బీజేపీ అగ్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నాపై విశ్వాసం ఉంచి ఆసన్‌సోల్‌ అభ్యర్థిగా ప్రకటించింది. కానీ, కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి పోటీ చేయలేను’ అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పవన్‌ సింగ్‌ తెలియజేశాడు. అయితే ఏం జరిగిందో ఏమోగానీ.. ఇప్పుడు పోటీ చేస్తానంటూ ప్రకటించాడు. మరి ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారా?.. వేరే చోటుకి ట్రాన్స్‌ఫర్‌ అయ్యారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

ఆసన్‌సోల్‌ టికెట్‌ను బీజేపీ పవన్‌కు ప్రకటించగానే.. తృణమూల్‌ కాంగ్రెస్‌ విమర్శలతో విరుచుకుపడింది. మహిళలను కించపరుస్తూ.. అసహ్యమైన రీతిలో పాటలు పాడి, నటించే వ్యక్తిని బీజేపీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెడుతోందంటూ మండిపడింది. ఇక.. ఆసన్‌సోల్‌ నుంచి టీఎంసీ బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, పొలిటీషియన్‌ శతృఘ్నసిన్హాను బరిలో దించింది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)