Breaking News

కమలం గూటికి జయసుధ.. ఎవరికి చెక్ పెట్టేందుకు?.. బీజేపీ బిగ్‌ ప్లాన్‌ ఇదేనా?

Published on Wed, 08/02/2023 - 11:37

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు రానున్న ఎన్నికలపై ఫోకస్‌ పెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా పార్టీలో చేరికలపై నేతలు బిజీగా ఉన్నారు. ఇక, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ నేతలు.. సీనియర్లను పార్టీ చేర్చే క్రమంలో ప్లాన్స్‌ చేస్తున్నారు.  ఆపరేషన్‌ ఆకర్ష్‌ను బీజేపీ వేగవంతం చేసింది.

మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి,మెదక్ డీసీసీబీ మాజీ ఛైర్మన్ జైపాల్ రెడ్డి,రంగారెడ్డి జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మన్  లక్ష్మారెడ్డి ,చెన్నూరు మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, సంజీవ రావు త్వరలో బీజేపీలోకి చేరబోతున్నట్లు సమాచారం. తాజాగా సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జయసుధ ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకొనున్నారు.

కాంగ్రెస్ తరఫున 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీచేసి జయసుధ గెలిచారు. సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి బరిలోకి జయసుధను దింపుతారని ప్రచారం. ఇప్పటికే ఈటలతో జయసుధ భేటీ అయిన సంగతి తెలిసిందే.
చదవండి: రాజకీయాలు చేయాల్సిన టైం ఇదా కేసీఆర్‌..?

ఎవరికి చెక్ పెట్టేందుకు జయసుధ?
ముషీరాబాద్ నుంచి తన అనుచరులకు టికెట్‌ ఇప్పించుకోవాలని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రయత్నాలు చేస్తుండగా, ముషీరాబాద్ నుంచి తన కుమార్తె విజయలక్ష్మిని బరిలోకి దింపాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రయత్నాలు చేస్తున్నారు. లక్ష్మణ్, దత్తాత్రేయలకు చెక్ పెట్టేందుకు జయసుధను తెస్తున్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)