Breaking News

మూడు పదవుల్లో ఏదిస్తారు?: రఘునందన్‌ అల్టిమేటం

Published on Mon, 07/03/2023 - 17:09

ఢిల్లీ: పలు రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టిన వేళ.. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఢిల్లీలో తిష్ట వేశారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఉన్న పదవి ఏదో ఒకటి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని పట్టుబట్టుకు కూర్చోన్నారు. ఈ మేరకు మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహిస్తూ తన ఆసక్తిని తెలియజేశారు రఘునందన్‌.

‘మూడు పదవుల్లో ఎదో ఒక పదవి ఇవ్వండి.  పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ లేదంటే జాతీయ అధికార ప్రతినిధి ఇవ్వండి. పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నా. నేనెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాను. కొన్ని విషయాల్లో నా కులమే నాకు శాపం కావచ్చు. రెండు నెలల్లో బిజెపి ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తది. రెండో సారి దుబ్బాక నుంచి ఎమ్మెల్యే గా గెలుస్తా. మునుగోడులో రాజగోపాల్ ను గెలిపిస్తానన్న అమిత్ షా గెలిపించలేకపోయారు. దుబ్బాకలో నా కష్టంతోనే గెలిచాను. పార్టీ సింబల్ అనేది చివరి అంశం.

నాకు దుబ్బాక ఎన్నికలలో ఎవరూ సాయం చెయ్యలేదు. నేను పార్టీలో ఉండాలని అనుకుంటున్నా. రెండేళ్లుగా జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్లను నియమించలేకపోయారు. శాసనసభ పక్ష నాయకుడిని కూడా నియమించలేకపోయారు. పార్టీని నడిపేది ఇలాగేనా?, నేను మూడు పదవులు ఆశిస్తున్నాను. ఒకటి జాతీయ అధికార ప్రతినిధి, రెండు బీజేపీ శాసనసభ పక్ష నేత , మూడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏదో ఒకటి ఇస్తారని భావిస్తున్నా. లేదంటే నా దారి నాదే’ అని వ్యాఖ్యానించారు. 

చదవండి: పాత మిత్రుల కౌంటర్ల ఎపిసోడ్‌కు శుభం కార్డు.. ‘ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టమంటూ..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)