Breaking News

'ప్రతిపక్షాల భేటీ ఓ ఫొటో సెషన్..' కేంద్ర మంత్రి వ‍్యంగ్యాస్త్రాలు..

Published on Sat, 06/24/2023 - 16:59

ఢిల‍్లీ: ప్రతిపక్షాల భేటీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యంగ్యాస్త్రాలు సందించారు. ఈ సమావేశం కేవలం ఒక ఫొటో సెషన్ మాత్రమేనని అన్నారు. చాయ్ పార్టీ జరుపుకోవడానికి ప్రతిపక్ష నాయకులు ఒక చోట కూడారని చెప్పారు. ఈ సమావేశంతో ప్రతిపక్ష నాయకులు చేయగలిగేది ఏం ఉండదని జోస్యం చెప్పారు. గడ్డం కత్తిరించి, పెళ్లి చేసుకోవాలని  లాలూ ప్రసాద్ యాదవ్.. రాహుల్ గాంధీకి సమావేశంలో సలహా ఇవ్వడాన్ని ఆయన గుర్తు చేశారు.

'ఇది కేవలం ఓ ఫొటో సెషన్ మాత్రమే. నితీష్ కుమార్‌తో కొన్ని నెలల క‍్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఇది జరిగింది. చిన్న చిన్న గుంపులు కలిసి ప్రధాని పదవిపై కలలు కంటున్నాయి. వీటితో ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు.' అని గిరిరాజ్ సింగ్ అన్నారు. 

ప్రతిపక్షాల భేటీ..
పట్నా వేదికగా బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో 15 ప్రతిపక్ష పార్టీల నాయకులు నేడు సమావేశమయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి బీజేపీని ఓడించి అధికారాన్ని దక్కించుకోవాలనే లక్ష‍్యంతో ఈ భేటీ జరిగింది. దేశంలో ప్రముఖ పార్టీ నాయకులైన రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, ఒమర్ అబ్ధుల్లా, హేమంత్ సొరేన్ తదితరులు పాల్గొన్నారు. అయితే.. ఇందులో ఎలాంటి ఏకాభిప్రాయానికి నాయకులు రాలేదు. మరో సమావేశాన్ని సిమ్లాలో వచ్చే నెలలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 

ఇదీ చదవండి: 'భారత్‌లో చాలా మంది హుస్సేన్ ఒబామాలు ఉన్నారు'.. అసోం సీఎం వ్యాఖ్యలపై రాజకీయ రగడ..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)