Breaking News

ఉత్తర తెలంగాణపై కమలం ఫుల్‌ ఫోకస్‌!

Published on Fri, 11/24/2023 - 03:59

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తర తెలంగాణపై కమలనాథులు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. సంప్రదాయబద్ధంగా పట్టున్న ఈ ప్రాంతంనుంచి ఈసారి కూడా మంచి ఫలితాల సాధనకు పార్టీ ఉత్తర తెలంగాణను నమ్ముకుంది. సంస్థాగతంగానూ, రాజకీయంగానూ ఇతర ప్రాంతాల కంటే ఇక్కడే పార్టీ పటిష్టంగా ఉండటంతో అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని అంచనా వేస్తోంది. ఉత్తర తెలంగాణలోని వివిధ జిల్లాల పరిధిలో అధిక సీట్లు గెలుస్తామన్న ధీమాను బీజేపీ ముఖ్యనేతలు వ్యక్తం చేస్తున్నారు.

2019 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కీలకమైన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ సీట్లు బీజేపీ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉత్తర తెలంగాణలో అధిక స్థానాల్లో గెలుపొంది సత్తా చాటాలనే పట్టుదలతో బీజేపీ నాయకత్వముంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల పట్ల ప్రజల్లో క్రమంగా సానుకూలత పెరుగుతున్నదని అంచనా వేస్తున్నారు.  

ముమ్మరంగా ప్రచారం చేసేలా... 
ముఖ్యంగా పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాల్లో అధిక సీట్లు గెలుచుకునే దిశలో వివిధ రూపాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించారు. అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామన్న హామీని వివిధ వర్గాల ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.

దీంతో పాటు ఉపకులాల వారీగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ప్రధాని మోదీ పూర్తి మద్దతు తెలపడంతో పాటు సమస్యల పరిష్కారంపై కచ్చితమైన హామీ ఇవ్వడంతో ఈ వర్గాల్లో బీజేపీపై సానుకూల స్పందన వ్యక్తమవుతోందని చెబుతున్నారు. ఈ పరిణామాల దృష్ట్యా బీసీ, ఎస్సీ, ఇతర వర్గాల నుంచి బీజేపీకి మద్దతు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన వైఖరి తీసుకోవడంతో బీజేపీకి ఎమ్మార్పిఎస్‌ నాయకత్వం మద్దతు తెలపడంతో పాటు బీసీ సీఎం నినాదాన్ని కూడా బలపరుస్తూ ప్రచారం చేయడం కూడా తమకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ కంటే అధికంగా 36 సీట్లను బీసీలకు బీజేపీ కేటాయించడం ద్వారా బీసీలకు పెరిగిన ప్రాధాన్యతను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)