సిద్దరామయ్య కొడుకుపై బీజేపీ నేతలు ఫైర్: ఎందుకంటే?

Published on Sat, 03/30/2024 - 14:22

బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతున్న తరుణంలో.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు 'యతీంద్ర సిద్ధరామయ్య' ప్రధానమంత్రి మోదీపైన కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీని, ఆయన ఇంటిని కించపరిచే పదజాలంతో దూషించారని పార్టీ నేతలు మండిపడ్డారు.

చామరాజనగర జిల్లా హనూర్ పట్టణంలో జరిగిన పార్టీ సమావేశంలో యతీంద్ర సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఎలక్షన్ కమీషన్ జారీ చేసిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) మార్గదర్శకాలను ఉల్లంఘించాయని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో బీజేపీ రాష్ట్ర విభాగం ఆరోపించింది. రాజకీయ నేతలపై వ్యక్తిగత దాడులు చేయడం ఆమోదయోగ్యం కాదని, యతీంద్ర సిద్ధరామయ్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

హోం మంత్రి అమిత్ షాను 'గూండా' అని, ఆయన నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని యతీంద్ర సిద్ధరామయ్య అన్నారు. అంతే కాకుండా నేర చరిత్ర ఉన్న వారితో మోదీ సహవాసం చేస్తున్నారని ఆరోపించారు.

యతీంద్ర సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు సబబు కాదని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు.  శాసనసభ్యుడిగా పనిచేసి.. ఒక ముఖ్యమంత్రి కుమారుడు అయిన వ్యక్తికి ఇలాంటి వ్యాఖ్యలు తగవని అన్నారు. యతీంద్ర సిద్ధరామయ్య తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని కోరారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)