Breaking News

బీఆర్‌ఎస్‌ అవినీతికి పాతరేద్దాం 

Published on Wed, 11/08/2023 - 04:58

గజ్వేల్‌: రజాకార్లకు సీఎం కేసీఆర్‌ వారసుడని, బీఆర్‌ఎస్‌ అవినీతి పాలనకు గజ్వేల్‌ నుంచే పాతరేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలు పునిచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ నామినేషన్‌ వేశా రు. ఈ సందర్భంగా పట్టణంలోని కోటమైసమ్మ ఆలయం వద్ద నుంచి ఇందిరాపార్కు మీదుగా ఐఓసీ (ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌) వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన రోడ్‌ షోలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరుల ఆత్మకు శాంతి చేకూరాలంటే బీఆర్‌ఎస్‌ పాలనకు చరమగీతం పాడాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి నేరుగా సీఎం ఫామ్‌హౌస్‌కే నీరు వస్తుండగా ప్రజలకు మాత్రం చుక్క నీరందడం లేదన్నారు. నియోజకవర్గంలోని 30వేల కుటుంబాలకు చెందిన భూములను లాక్కొని, ఆ కుటుంబాలను కేసీఆర్‌ రోడ్డున పడేశారని ఆరోపించారు. గజ్వేల్‌లో డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లు ఇవ్వకపోగా, ఉన్న ఇండ్లను కూలగొట్టారని మండిపడ్డారు. 

ప్రజాస్వామ్య పరిరక్షణకు వదిలిన బాణమే ఈటల 
ఈ ఎన్నికల్లో గజ్వేల్లోనే కాదు కామారెడ్డిలోనూ కేసీఆర్‌కు ఓటమి తప్పదని కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణకు వదిలిన బాణమే ఈటల రాజేందర్‌ అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బీసీ నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ గజ్వేల్‌కు కేసీఆర్‌ పరాయి వ్యక్తి అని, తాను కాదని చెప్పారు. తానూ 1992 నుంచి ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమ నడపానని, అప్పటినుంచి తనకు ఈ ప్రాంతంతో అవినాభావ సంబంధం ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు కేసీఆర్‌ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధంగా ఈటల అభివర్ణించారు. 

గజ్వేల్‌ రోడ్‌షోలో ప్రసంగిస్తున్న కిషన్‌రెడ్డి. చిత్రంలో ఈటల 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)