Breaking News

15 సీట్లు గెలిస్తే చాలు.. సీఎం బఘేల్‌

Published on Thu, 11/23/2023 - 20:07

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 55 సీట్లు గెలుస్తామని మాజీ సీఎం రమణ్ సింగ్ చేసిన వ్యాఖ్యపై బఘేల్ స్పందిస్తూ..  ఇది ఆయన చేసిన బూటకపు ప్రకటన అని కొట్టిపారేశారు.

రమణ్ సింగ్ వ్యాఖ్యలపై బఘెల్ మాట్లాడుతూ ‘రమణ్ సింగ్ ప్రజాదరణ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడే 52 సీట్లను అధిగమించలేదు. ఇప్పుడు 55 సీట్లు గెలుస్తారని ఎలా అనుకుంటున్నారు? ఆయన ఇదంతా తమ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని పెంచడానికే చెబుతున్నాడు. కనీసం 15 సీట్లయినా సాధిస్తారో లేదో ఫలితాలు వచ్చాక అందరికీ తెలిసిపోతుంది’ అన్నారు.

నవంబర్ 7న మొదటి దశ ఎన్నికల తర్వాత మాజీ సీఎం రమణ్ సింగ్ రాష్ట్రంలో బీజేపీ  విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ‘మొదటి దశ ఎన్నికలు ముగిశాయి. 20 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఈ 20 సీట్లలో బీజేపీ కనీసం 14 స్థానాలను గెలుచుకుంటుంది" అని రమణ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో 90 నియోజకవర్గాలు ఉండగా నవంబర్‌ 7న తొలిదశ, నవంబర్ 17న రెండో దశతో ఎన్నికలు ముగిశాయి. ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)