Breaking News

TS: మోదీ పర్యటన వేళ.. పార్టీ ఆఫీసు ధ్వంసం చేసిన బీజేపీ నేతలు!

Published on Thu, 07/06/2023 - 18:54

సాక్షి, వరంగల్‌: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్‌ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు.. కొన్ని జిల్లాల్లో పార్టీ నేతల మధ్య సఖ్యత కుదరడం లేదు. ఇక, రెండు రోజుల్లో వరంగల్‌ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీలో రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గమన్నాయి. ఈ క్రమంలో పార్టీ నేతలు బీజేపీ ఆఫీసుపైనే దాడులు చేయడం సంచలనంగా మారింది. కొందరు నేతలు తమకు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదని పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారు. 

వివరాల ప్రకారం.. నర్సంపేట పట్టణంలో బీజేపీలో ఒక్కసారిగా ఎప్పటి నుండో నివురుగప్పిన ట్లుగా ఉన్న అసమ్మతి  బయటకు వచ్చింది. పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంపై సొంత పార్టీ నేతలు దాడి చేశారు. పార్టీలో మాకు గుర్తింపు లేదు, ప్రాధాన్యం లేదని దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. దీంతో, ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. వాగ్వాదంలో భాగంగా పార్టీ కార్యాలయం ధ్వంసం చేశారు. అయితే, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సమక్షంలోనే ఈ దాడి చోటుచేసుకోవడం గమనార్హం. ఇక, ప్రధాని మోదీ పర్యటన వేళ వరంగల్‌ జిల్లాలో ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: త్వరలో ధరణి ఫైల్స్ రిలీజ్ చేయబోతున్నాం.. రేవంత్‌ సంచలన ఆరోపణలు

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు