Breaking News

దేశ సందపను దోపిడీ చేస్తున్నారు: అసెంబ్లీలో భట్టి విక్రమార్క ఫైర్‌

Published on Wed, 02/08/2023 - 13:04

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది. కాగా, సమావేశాల సందర్భంగా కాంగ్రెస్‌ నేత భట్లి విక్రమార్క.. కేసీఆర్‌ సర్కార్‌పై కౌంటర్‌ అటాక్‌కు దిగారు. అటు కేంద్ర ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. 

సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అంకెలు పెద్దగా ఉన్నాయి.. కేటాయింపులు చిన్నగా ఉన్నాయి. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఏమీ ప్రకటించలేదు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. అదానీ కంపెనీ ఏం చేసిందో బయటపడింది. హిండెన్‌బర్గ్‌ అన్నీ బయటపెట్టింది. దేశ సంపద దోపిడీకి గురవుతోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ లేదు. రూ. 4.86 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఈ అప్పులన్నీ ఎవరు కట్టాలి?. సామాన్యులపైనే భారం పెరుగుతోంది. 

తలసారి ఆదాయం ఎలా పెరిగిందో లెక్కలు చెప్పాలి. రాష్ట్రంలో కొంత మంది తలసరి ఆదాయం మాత్రమే పెరిగింది. పేదలు ఇళ్లు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో విచ్చలవిడిగా బిల్లులు వేస్తున్నారు. నారాయణ విద్యా సంస్థల్లో లక్షలు వసూలు చేస్తున్నారు. ఆసుపత్రులు, విద్యా సంస్థల్లో ఫీజులపై నియంత్రణ ఉండాలి అని సూచనలు చేశారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)