Breaking News

నయా పెట్టుబడిదారుల నుంచి జార్ఖండ్‌ను రక్షించాలి

Published on Mon, 11/11/2024 - 03:41

సాక్షి, హైదరాబాద్‌: అదానీ, అంబానీ లాంటి నయా పెట్టుబడిదారుల నుంచి జార్ఖండ్‌ రాష్ట్రానికి విముక్తి కల్పించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జార్ఖండ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాని ఆయన ప్రజలను కోరారు. ఆదివారం భట్టి జార్ఖండ్‌లోని రాంఘర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ స్థాయి సమావేశం, చిత్తార్పూర్‌ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో మాట్లాడుతూ, కొద్ది మంది పెట్టుబడిదారుల చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, చైతన్యంగల కాంగ్రెస్‌ కార్యకర్తలు జార్ఖండ్‌ రాష్ట్రాన్ని, వనరులను దోపిడీదారుల నుంచి కాపాడాలని పిలుపునిచ్చారు.

భారత్‌ జోడో యాత్రలో భాగంగా దేశంలో విద్వేషం ఉండకూడదని, సంపద అందరికీ సమానంగా పంచాలని రాహుల్‌ గాంధీ ఇచి్చన సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని కోరారు. అన్ని స్థాయిల్లో కాంగ్రెస్‌ పార్టీ నేతలు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని, ఇండియా కూటమి హామీలను, మేనిపెస్టోను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఏఐసీసీ నేతలు గులాం అహ్మద్‌మీర్, సిరివెళ్ల ప్రసాద్, జార్ఖండ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కేశవ్‌ కమలేశ్‌ మహతో, మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు తారిఖ్‌ అన్వర్‌లతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)