Breaking News

ఫలితాలపై బెట్టింగ్‌ మార్కెట్‌ ప్రకంపనలు

Published on Thu, 05/30/2024 - 10:05

2024 లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. చివరి దశ ఓటింగ్‌ జూన్‌ ఒకటిన జరగనుంది. జూన్‌ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం తమదేననే నమ్మకంతో ఉంది. ప్రధాని మోదీ కూడా బీజేపీకి 400కు పైగా లోక్‌సభ స్థానాలు దక్కుతాయని జోస్యం చెప్పారు. అయితే ‘బెట్టింగ్‌ మార్కెట్‌’ దీనికి భిన్నమైన వాదన వినిపిస్తోంది.

ముంబైకి చెందిన టాప్ బుకీ ఒకరు మీడియాతో మాట్లాడుతూ ప్రారంభంలో అంటే మొదటి దశ ఓటింగ్‌కు ముందు, బీజేపీకి దక్కే సీట్లు అధికంగా ఉంటాయనే అంచనాలున్నాయన్నారు. అయితే అయితే మూడు దశల ఓటింగ్ తర్వాత బీజేపీకి  ఆదరణ తగ్గిందన్నారు. ఇప్పుడు ఆరు దశల ఓటింగ్ తర్వాత బీజేపీ పరిస్థితి తారుమారయ్యిదన్నారు.

బెట్టింగ్ మార్కెట్ అంచనాల ప్రకారం ప్రస్తుతం బీజేపీ 295 నుంచి 305 సీట్లు గెలుచుకునే  అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు 55 నుంచి 65 సీట్లు వస్తాయనే అంచానాలున్నాయి. మార్కెట్ ఎప్పుడూ బీజేపీ చెప్పిన 400 లెక్కకు మద్దతునివ్వలేదు. మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం బీజేపీకి 350 సీట్లు కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదని ముంబై బుకీ తెలిపారు. దేశంలో వివిధ ప్రాంతాల్లోని బెట్టింగ్‌ మార్కెట్లు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు దక్కే లోక్‌సభ సీట్లపై వేసిన అంచనాలిలా ఉన్నాయి.

ఫలోడి బెట్టింగ్‌ మార్కెట్‌ (రాజస్థాన్‌)
🔹కాంగ్రెస్ - 117
🔹ఇండియా - 246
🔹బీజేపీ - 209
🔹ఎన్‌డీఏ - 253

పాలన్పూర్ (గుజరాత్‌)
🔹కాంగ్రెస్ - 112
🔹ఇండియా - 225
🔹బీజేపీ - 216
🔹ఎన్‌డీఏ - 247

కర్నాల్ (హర్యానా)
🔹కాంగ్రెస్ - 108
🔹ఇండియా - 231
🔹బీజేపీ - 235
🔹ఎన్‌డీఏ-263

బెల్గాం (కర్నాటక)
🔹కాంగ్రెస్ - 120
🔹ఇండియా - 230
🔹బీజేపీ - 223
🔹ఎన్‌డీఏ-265

కోల్‌కతా 
🔹కాంగ్రెస్ - 128
🔹భారతదేశం - 228
🔹బీజేపీ - 218
🔹ఎన్‌డీఏ - 261

విజయవాడ 
🔹కాంగ్రెస్ - 121
🔹ఇండియా- 237
🔹బీజేపీ - 224
🔹ఎన్‌డీఏ - 251

ఇండోర్ 
🔹కాంగ్రెస్ - 94
🔹ఇండియా - 180
🔹బీజేపీ - 260
🔹ఎన్‌డీఏ - 283

అహ్మదాబాద్ 
🔹కాంగ్రెస్ - 104
🔹ఇండియా - 193
🔹బీజేపీ - 241
🔹ఎన్‌డీఏ-270

సూరత్ 
🔹కాంగ్రెస్ - 96
🔹ఇండియా - 186
🔹బీజేపీ - 247
🔹ఎన్‌డీఏ - 282

దేశంలోని పలు బెట్టింగ్‌ మార్కెట్‌లు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ - బీజేపీల మధ్య గట్టి పోటీని సూచిస్తున్నాయి. జూన్ ఒకటిన చివరి దశ ఓటింగ్ జరిగాక, జూన్ 4న వెలువడే ఫలితాల్లో ఏ పార్టీ సత్తా ఎంతో తేలిపోనుంది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)