ఆందోల్‌ (ఎస్సి) నియోజకవర్గంని పరిపాలించే అభ్యర్థి ఎవరు?

Published on Mon, 07/31/2023 - 13:46

ఆందోల్‌ (ఎస్సి) నియోజకవర్గం

ఆందోల్‌ రిజర్వుడ్‌ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్దిగా పోటీచేసిన జర్నలిస్టు క్రాంతి కిరణ్‌ తొలిసారి విజయం సాధించారు. ఆయన తన సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ది, మాజీ ఉప ముఖ్య మంత్రి దామోదర రాజ నరసింహపై 16851 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. క్రాంతికిరణ్‌కు 104229 ఓట్లు రాగా, దామోదర రాజనరసింహకు 87378 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ  గతంలో టిఆర్‌ఎస్‌ తరపున గెలిచిన ప్రముఖ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్‌ 2018లో  బిజెపి పక్షాన పోటీచేసి ఓటమి చెందారు. కేవలం 2350 ఓట్లు మాత్రమే తెచ్చుకుని డిపాజిట్‌ కోల్పోయారు.

2014లో దామోదర రాజనరసింహ ఓటమి చెందారు. ఆయనపై టిఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి బాబూ మోహన్‌ 3291 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. బాబూ మోహన్‌ 2014లో ఎన్నికలకు కొద్ది రోజుల ముందే టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరారు. బాబూమోహన్‌ 2014లో గెలవడంతో మూడోసారి గెలిచినట్లయింది. ఈ నియోజకవర్గానికి మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ ఐ కలిసి తొమ్మిది సార్లు, టిడిపి నాలుగుసార్లు టిఆర్‌ఎస్‌ రెండుసార్లు  గెలిచాయి. ఒకసారి ఇండిపెండెంటు నెగ్గారు. దామోదర రాజనరసింహ గతంలో డాక్టర్‌ వై.ఎస్‌.

రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రివర్గాలలో సభ్యుడిగా ఉన్నారు. కిరణ్‌ ముఖ్యమంత్రి అయిన కొంతకాలానికి దామోదర రాజనరసింహ ఉప ముఖ్యమంత్రిగా ప్రమోషన్‌ పొందారు. ఈయన తండ్రి రాజనరసింహ కాసు, పి.వి. అంజయ్యల మంత్రివర్గాలలో పనిచేసారు. తండ్రి, కొడుకులు ఇద్దరూ మంత్రులైన ఘనత వీరికి దక్కింది. వీరిద్దరూ కలిసి ఏడుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. దామోదర అందోల్‌లో మూడుసార్లు, ఈయన తండ్రి రాజనరసింహ ఇక్కడ మూడుసార్లు, సదాశివపేటలో ఒకసారి మొత్తం నాలుగుసార్లు గెలిచారు.

ఇక్కడ నుంచి గెలుపొందిన మరో ఇద్దరు కూడా మంత్రులయ్యారు. టిడిపి తరుఫున గెలిచిన రాజయ్య గతంలో ఎన్‌.టి.ఆర్‌, చంద్రబాబుల క్యాబినెట్‌లలో పనిచేసారు. 1998, 1999లలో సిద్దిపేట నుంచి లోక్‌సభకు కూడా రాజయ్య  ఎన్నికయ్యారు. 1998లో లోక్‌సభకు ఎన్నికైన కారణంగా ఆందోల్‌ సీటుకు రాజీనామా చేయగా, జరిగిన ఉప ఎన్నికలో సినీనటుడు బాబూమోహన్‌ గెలుపొందారు. ఆయన తిరిగి 1999లో కూడా గెలిచి చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. 2014లో టిఆర్‌ఎస్‌ పక్షాన గెలిచి, 2018లో బిజెపి నుంచి పోటీచేసి ఓడిపోయారు.

ఆందోల్‌ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)