Breaking News

ప్రజల్లో వ్యతిరేకత వల్లే ఈ దౌర్జన్యాలు

Published on Mon, 12/16/2024 - 04:09

రాజమహేంద్రవరం సిటీ: సాగునీటి సంఘాల ఎన్ని­కల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిందని తూ­ర్పు గోదావరి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని మాజీ ఎమ్మె­ల్యే జక్కంపూడి రాజా నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూట­మి ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. 

గడిచిన ఆర్నెలల్లో ప్రభుత్వం ఏమీచేయకపోవడంవల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, అందుకే ఏకగ్రీవం పేరుతో విపక్ష పార్టీలను నామినేషన్లు వేయకుండా చేశారని చెల్లుబోయిన ఆరోపించారు.  విపక్ష పార్టీలకు చెందిన వారికి నో డ్యూస్‌ సరి్టఫికెట్లు ఇవ్వకుండా చేయడానికి వీఆర్వోలను ఎమ్మా­ర్వో ఆఫీసుల్లో ఉంచేయడం, కొన్నచోట్ల బంధించడం, వారి దగ్గరకు వెళ్లకుండా పోలీసులను ప్రయోగించి అడ్డగించడం ద్వారా నామినేషన్లు వేయకుండా చేశారన్నారు. 

ఇక విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో అయితే కూటమిలో భాగస్వామి అయిన బీజేపీకి చెందిన అభ్యరి్థనే నామినేషన్‌ వేయకుండా చేసి అధికార పార్టీకే కొమ్ము కాశారన్నారు. ఏమాత్రం పారదర్శకత లేకుండా కూటమి ప్రభుత్వం ఏకపక్ష ధోరణిలో వ్యవహరించడం దారుణమని చెల్లుబోయిన చెప్పారు.  

రైతులు బాగా అసంతృప్తితో ఉన్నారు : జక్కంపూడి 
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఒకటి ఎన్నికల తర్వాత మరొకటి చెప్పడం చంద్రబాబుకి మొదటినుంచీ అలవాటేనన్నారు. సూపర్‌ సిక్స్‌ అని చెప్పి, ఈ ఆర్నెలల్లో ఒక్కటి కూడా అమలు చేయకపోవడంతో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు.

ముఖ్యంగా రైతులు బాగా అసంతృప్తితో ఉన్నారని.. అందుకే సాగునీటి సంఘాల ఎన్నికలను అరాచక పద్ధతిలో నిర్వహిస్తున్నారని జక్కంపూడి విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులున్నా సరే, రైతులకు ఎప్పటికప్పుడు రూ.13,500ల పెట్టుబడి సాయం అందించామని.. అయితే, కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ ఆ ఊసే ఎత్తడంలేదని ఎద్దేవా చేశారు. 

సాగునీటి సంఘాల ఎన్నికల్లో ప్రజలందరూ ప్రభుత్వ అరాచకాన్ని  గమనిస్తున్నారని.. పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు సమయం వచ్చినపుడు బుద్ధి చెబుతారన్నారు.  

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)