Breaking News

‘రెండోసారి నన్ను గెలిపించాలని అనుకోలేదేమో’

Published on Mon, 03/03/2025 - 21:59

నల్లగొండ జిల్లా :  వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసిన  యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఓటమి పాలయ్యారు. అంతకుముందు ఎమ్మెల్సీ గా ఉన్న ఆయన.. ఈసారి ఓటమి పాలయ్యారు.   నర్సిరెడ్డిపై పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు.ఓటమి అనంతరం నర్సిరెడ్డి కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘ ఈ ఓటమి నన్ను బాధించటం లేదు. గెలుపు ఓటములు సహజం. ఓటమిని అంగీకరిస్తున్నా.  గెలిచిన అభ్యర్థి ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాలని సూచిస్తున్నాను.  ఉపాధ్యాయులు రెండోసారి నన్ను గెలిపించాలని అనుకోలేదేమో. ప్రచారం ఉధృతంగా చేసినా నేను ఎందుకు ఓడిపోయానో ఉపాధ్యాయులకు తెలుసు. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదు’ అని తెలిపారు.

ఇది ఉపాధ్యాయుల విజయం
ఇక నర్సిరెడ్డిపై విజయం సాధించిన పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి సైతం అదే కౌంటింగ్ కేంద్ర వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఉపాధ్యాయులు ఇచ్చిన తీర్పు విలువైనది. .  ఉపాధ్యాయుల విజయం  మండలి సభ్యుడిగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తా.  విద్యారంగాన్ని పటిష్టం చేసేలా అవసరం అయితే ఉద్యమాలు సైతం చేస్తా.  ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తాను. ఉన్నత విద్య అందరికీ అందుబాటులో ఉండేలా కృషి చేస్తాను. నా గెలుపు ముందుగా ఊహించిందే’ అని పేర్కొన్నారు పింగళి శ్రీపాల్ రెడ్డి.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)