Breaking News

ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి అఖిలేష్‌?

Published on Sun, 05/26/2024 - 07:41

దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ఆరవ దశ పోలింగ్‌ ముగిసింది. ఇంకా ఒక దశ  అంటే ఏడవ దశ ఓటింగ్‌ మాత్రమే మిగిలివుంది. అయితే ఇప్పటికీ ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయం వెల్లడికాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా యూపీకి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎ‍మ్మెల్యే  కవీంద్ర చౌదరి దీనికి సమాధానమిచ్చారు.

మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నికలని పేర్కొన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి అయిన కవీంద్ర చౌదరి.. ఈసారి ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావాలని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని, అన్ని మతాలు, కులాల వారు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు ఓటర్లపై దాడులకు దిగారని, దీనిపై జిల్లా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేశామని అన్నారు. బీజేపీకి 147 కంటే తక్కువ సీట్లు వస్తాయని, ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నదని కవీంద్ర చౌదరి జోస్యం చెప్పారు.

ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయాన్ని ప్రస్తావించిన ఆయన సమాజ్‌వాది పార్టీ చీఫ్‌ అఖిలేష్ యాదవ్ ఆస్ట్రేలియాలో చదువుకున్నారని, ఆయనకు ప్రభుత్వాన్ని నడపడంలో అనుభవం ఉన్నందున ఆయనే ప్రధాని అయ్యేందుకు అర్హత కలిగిన అభ్యర్థి అని పేర్కొన్నారు. 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)