Breaking News

ఎంపీగా కొనసాగుతా.. ఎమ్మెల్యే పదవిని వదులుకుంటా: అఖిలేష్‌

Published on Tue, 06/11/2024 - 15:53

ల‌క్నో: స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేష్ యాద‌వ్ మంగ‌ళ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.  కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతానని, కర్హల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ‌నున్న‌ట్లు ఆయ‌న ప్రకటించారు.

కాగా 2022లో క‌ర్హల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అఖిలేష్ యాద‌వ్.. ఇటీవ‌ల జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో క‌న్నౌజ్ నుంచి ఎంపీగా బ‌రిలో దిగిన విష‌యం తెలిసిందే. స‌మాజ్ వాదీ పార్టీకి కంచుకోట అయిన క‌న్నౌజ్ నుంచి అఖిలేష్ భారీ మెజార్టీతో గెలుపొందారు.

అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, “నేను కర్హల్, మొయిన్‌పురి కార్యకర్తలను కలిశాను. రెండు ఎన్నిక‌ల్లోనూ రెండు స్థానాల నుంచి గెలిచాను. కాబ‌ట్టి ఒక సీటును వ‌దులుకోవాలి. క‌ర్హ‌ల్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయ‌నున్నాన‌నే విష‌యం మీకు తెలియ‌జేస్తున్నాన‌ను` అని పేర్కొన్నారు.

’లోక్‌సభలో ఎస్పీ నేత‌గా అఖిలేష్ యాదవ్ వ్యవహరిస్తారు. దీనికి సంబంధించిన లాంఛనాలు ఢిల్లీలో పూర్తవుతాయి. యాదవ్ ప్రతిపక్ష నేతగా ఉన్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి రాజీనామా చేస్తారు` అని పార్టీ సీనియర్ నేత తెలిపారు.

కాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఎస్పీ.. మొత్తం 80 స్థానాల్లో కూట‌మి 43 స్థానాల‌ను గెలుచుకుంది. ఎస్పీ 37 సీట్ల‌లో సొంతంగా విజ‌యం సాధించి లోక్‌సభలో మూడవ అతిపెద్ద పార్టీగా అవతరించింది.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)