Breaking News

UP By-election: క్రిమినల్‌ కేసులో ఎమ్మెల్యే సభ్యత్వం రద్దయి.. ఉపఎన్నిక జరిగిన చోట..

Published on Thu, 11/21/2024 - 09:31

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఈ ఫలితాలు సమాజ్‌వాదీ పార్టీకి కీలకంగా మారాయి. ముఖ్యంగా కాన్పూర్‌లోని సీసామవు ​​అసెంబ్లీ స్థానంపై సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

సీసామవు అసెంబ్లీకి చెందిన సమాజ్‌వాదీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి ఒక క్రిమినల్‌ కేసులో దోషిగా తేలిన దరిమిలా అతని సభ్యత్వం రద్దయ్యింది. అనంతరం ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. కాగా భారతీయ జనతా పార్టీకి చెందిన రాకేష్ సోంకర్ 1996లో ఇక్కడ నుంచి విజయం సాధించారు. డీలిమిటేషన్ తర్వాత ఈ సీటు ముస్లింల ప్రాబల్యం కలిగినదిగా మారింది. తదనంతరం ఎస్పీ నేత ఇర్ఫాన్ సోలంకి 2012 నుంచి 2022 వరకు ఇక్కడ నుంచి ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు.

కాన్పూర్‌లోని సీసామవు ​​స్థానం అఖిలేష్ యాదవ్‌కు బలమైన స్థానాల్లో ఒకటి. అయితే ఇప్పుడు సీసామవు అసెంబ్లీ సీటు అటు బీజేపీ, ఇటు ఎస్పీకి ప్రతిష్ఠాత్మకంగా  నిలిచింది. సీసామవు స్థానం నుంచి బీజేపీ తరపున సురేశ్ అవస్థీ బరిలో నిలిచారు. ఈసారి  సీసామవు అసెంబ్లీ స్థానంలో ఎస్పీ, కాంగ్రెస్‌లు పొత్తు పెట్టుకుని పోటీ చేయడం బీజేపీకి పెద్ద సవాల్‌గా మారింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఇర్ఫాన్ సోలంకీకి 79,163 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 5,616 ఓట్లు రాగా, బీజేపీకి 66,897 ఓట్లు వచ్చాయి. 
 

ఇది కూడా చదవండి: Delhi air pollution: కాస్త ఉపశమనం.. ఊపిరి​కి ఊరట

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)