ఆరు స్థానాలకు ఎస్పీ అభ్యర్థులు.. ప్రకటించిన అఖిలేష్‌

Published on Thu, 03/21/2024 - 08:13

లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లోని ఆరు స్థానాలకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సంభాల్ నుంచి ఎస్పీ టికెట్‌పై జియావుర్ రెహమాన్ బుర్క్ పోటీ చేయనుండగా, బాగ్‌పత్ నుంచి మనోజ్ చౌదరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.

రాహుల్ అవానా గౌతమ్ బుద్ధ నగర్ నుంచి పోటీ చేస్తారని ఎస్పీ విడుదల చేసిన జాబితా పేర్కొంది. అలాగే భగవత్ శరణ్ గంగ్వార్ పిలిభిత్ నుంచి, రాజీవ్ రాయ్ ఘోసీ నుంచి పోటీ చేయనున్నారు. రాజేంద్ర ఎస్ బింద్ మీర్జాపూర్ నుంచి ఎస్పీ టికెట్‌పై పోటీ చేస్తారని తెలిపింది.

మొత్తం ఏడు దశలలో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో అన్ని దశల్లోనూ పోలింగ్‌ జరగనుంది. అభ్యర్థులకు సంబంధించి సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటివరకూ ఐదు జాబితాలు ప్రకటించగా ఇది ఆరోది. దీంతో ఎస్పీ ప్రకటించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 47కి చేరింది. భాదోహి సీటును తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి ఇచ్చింది.

‘ఇండియా’ కూటమి మిత్ర పక్షమైన సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లోని 17 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌కు వదిలివేసింది. కాంగ్రెస్ పోటీ చేయనున్న ఈ 17 స్థానాల్లో ఒకప్పుడు ఆ పార్టీ కంచు కోటలుగా భావించే రాయ్‌బరేలీ, అమేథీతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసి ఉన్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)