Breaking News

బడ్జెట్‌ వేళ.. 146 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత

Published on Tue, 01/30/2024 - 16:55

ఢిల్లీ, సాక్షి: సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న చివరి పార్లమెంట్‌ సమావేశాలను(బడ్జెట్‌) కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా 146 మంది విపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ ఎత్తివేతకు కృషి చేసింది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి మంగళవారం అఖిల పక్ష భేటీ తర్వాత ప్రకటించారు.   

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో దుండగుల దాడితో అలజడి రేగిన విషయం తెలిసిందే. ఈ భద్రతా వైఫ్యలంపై కేంద్ర హోం శాఖ వివరణ ఇవ్వాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో సభా కార్యకలాపాలకు విఘాతం కలిగించారనే కారణంతో లోక్‌సభ నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేశారు స్పీకర్‌ ఓం బిర్లా. అదే సమయంలో రాజ్యసభలోనూ ఇలా అవాంతరాలు కలిగిన సభ్యుల్ని సస్పెండ్‌ చేశారు చైర్మన్‌. 

అయితే బడ్జెట్‌ సమావేశాలు.. అదీ ఎన్నికలకు ముందు ఓటాన్‌ బడ్జెట్‌ కావడంతో సభ్యులంతా ఉండాలని కేంద్రం ఆశిస్తోంది. ‘‘అన్ని సస్పెన్షన్లను ఎత్తేస్తున్నాం. ఈ విషయమై లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్‌లతో మాట్లాడాం. ప్రభుత్వం తరఫున సస్పెన్షన్‌ ఎత్తివేయాలని వాళ్లను కోరాను. అందుకు వాళ్లు అంగీకరించారు అని తెలిపారాయన. లోక్‌సభ నుంచి 135 మంది, రాజ్యసభ నుంచి 11 మంది సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇక రేపటి నుంచి(జనవరి 31) ఫిబ్రవరి 9వ తేదీదాకా బడ్జెట్‌ సెషన్‌ జరగనుంది. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు