Breaking News

Delhi: సుష్మా, కేజ్రీ, రేఖ.. హర్యానాతో లింకేంటి?

Published on Thu, 02/20/2025 - 09:03

న్యూఢిల్లీ: రేఖా గుప్తాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపిక చేసింది. ఆమె హర్యానాలోని జింద్‌లోగల నంద్‌గర్ గ్రామానికి చెందినవారు. రేఖా గుప్తాకు ముందు ఢిల్లీకి సీఎంలుగా పనిచేసిన సుష్మా స్వరాజ్‌, కేజ్రీవాల్‌ కూడా హర్యానాకు చెందినవారే కావడం విశేషం. ఈ ముగ్గురికీ హర్యానాతో ఉన్న సంబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రేఖా గుప్తా(Rekha Gupta) తాత మణిరామ్ కుటుంబం నందఘర్‌లో  ఉండేది. రేఖా గుప్తా తండ్రి జై భగవాన్ బ్యాంక్ మేనేజర్‌గా పదోన్నతి పొందిన సమయంలో వారి కుటుంబం ఢిల్లీకి చేరుకుంది.  రేఖా గుప్తా కంటే ముందు ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా హర్యానాకు చెందినవారే. అలాగే బీజేపీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్ కూడా హర్యానాతో సంబంధం కలిగివున్నారు.

రేఖా గుప్తా
రేఖ గుప్తా 1974, జూలై 19న జన్మించారు. రేఖ తన విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. రేఖ గతంలో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. మొదటిసారి ఆమె 11,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తరువాత ఆమె ఆప్ అభ్యర్థి వందన చేతిలో 4,500 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి ఆమె వందనను భారీ ఓట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించారు.  మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ స్థానం నుండి పోటీకి దిగిన ఆప్ అభ్యర్థి వందనకు 38605 ఓట్లు రాగా, రేఖా గుప్తాకు 68200 ఓట్లు వచ్చాయి.

అరవింద్ కేజ్రీవాల్
అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) 1968లో హర్యానాలోని హిసార్‌లో జన్మించారు. 1991లో ఐఐటీ ఖరగ్‌పూర్ నుండి ఇంజనీరింగ్ పూర్తిచేశారు. 1992లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లోని ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు ఎంపికయ్యారు. కేజ్రీవాల్‌ తొలుత ఢిల్లీలోని ఆదాయపు పన్ను కమిషనర్‌ కార్యాలయంలో నియమితులయ్యారు. ఆయన 2006 లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, అరుణా రాయ్ వంటి ఇతర సహోద్యోగులతో కలిసి సమాచార హక్కు చట్టం కోసం ప్రచారాన్ని ప్రారంభించారు.

సుష్మా స్వరాజ్
సుష్మా స్వరాజ్(Sushma Swaraj) 1952 ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలాలో జన్మించారు. అంబాలా కంటోన్మెంట్‌లోని ఎస్‌డీ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందాడు.  అనంతరం పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్బీ డిగ్రీని పొందారు. సుష్మా 1975 జూలై 13న భారత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది స్వరాజ్ కౌశల్‌ను వివాహం చేసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతి తక్కువ కాలం పనిచేసిన వారిలో సుష్మా రెండవ వ్యక్తి. ఆమె 57 రోజుల పాటు సీఎంగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: Delhi: రేఖా గుప్తాతో పాటు ప్రమాణం చేయనున్న ఆరుగురు మంత్రులు వీరే..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)