Breaking News

అనూహ్యంగా తెరపైకి బల్మూరి వెంకట్‌ 

Published on Wed, 01/17/2024 - 06:28

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట నర్సింగరావు పేరు తెరపైకి వచ్చింది. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ పేరు దాదాపు ఖరారైందని ప్రచారం జరిగినా, మంగళవారం అనూహ్యంగా వెంకట్‌ రేసులోకి వచ్చారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌తో పాటు వెంకట్‌ను రెండో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.

ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం నుంచే ప్రచారం జరిగినా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఇద్దరికీ ఏఐసీసీ నుంచి వ్యక్తిగతంగా సమాచారం అందిందని, నామినేషన్లు సిద్ధం చేసుకోవాల్సిందిగా  సూచించినట్లు తెలిసింది. ఈ నెల 18న నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఏ క్షణమైనా ఈ ఇద్దరి పేర్లను ఏఐసీసీ అధికారికంగా ప్రకటిస్తుందని తెలుస్తోంది. నిజానికి మంగళవారమే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందని, బుధవారం అధికారిక ప్రకటన వస్తుందని గాంధీ భవన్‌ వర్గాలంటున్నాయి. 

జగ్గారెడ్డికి బీ ఫారాలపై సంతకాల అధికారం 
ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు సమర్పించనున్న బీఫారాలపై  టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి.జగ్గారెడ్డి సంతకాలు చేయనున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో బీఫారాలిచ్చే అధికారాన్ని ఏఐసీసీ జగ్గారెడ్జికి ఇచి్చంది. ఇక నామినేషన్ల దాఖలు, ఎమ్మెల్యేల చేత ప్రతిపాదిత సంతకాలు చేయించే వ్యవహారాలను సమన్వయం చేసే బాధ్యతను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించినట్టు సమాచారం. 

కాంగ్రెస్‌ అధిష్టానం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో అతిపిన్న వయస్కుడిగా మండలిలో అడుగుపెట్టే ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్‌ రికార్డు సృష్టించనున్నారు. దేశంలోనే శాసనమండలికి ఎన్నికైన వారిలో ఇంత చిన్న వయస్సు ఉన్న వారెవరూ లేరు. ప్రస్తుతం వెంకట్‌ వయసు 30 సంవత్సరాల 9 నెలలు. ఇప్పటివరకు 33 ఏళ్ల వయసులో ఒకరు గుజరాత్‌ శాసనమండలికి ఎన్నిక కావడమే రికార్డు అని, ఇప్పుడు ఆ రికార్డును వెంకట్‌ అధిగమిస్తారని గాంధీభవన్‌ వర్గాల సమాచారం.   

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)