Breaking News

రాముడు వచ్చాడు.. న్యాయం చేశాడు: అభిషేక్‌ బెనర్జీ సెటైర్లు

Published on Wed, 06/05/2024 - 16:02

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) అగ్రనేత, ఎంపీ అభిషేక్‌ బెనర్జీ బీజేపీపై సెటైర్లు వేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ వెనుకబడడంపై ఆయన బుధవారం(జూన్‌5) స్పందించారు. ‘రాముడు వచ్చాడు. న్యాయం చేశాడు ’అని బీజేపీని ఉద్దేశించి సెటైర్‌ వేశారు.

‘బీజేపీపై ప్రజలు ఎంత కోపంగా ఉన్నారన్నది ఎన్నికల ఫలితాలు చూస్తే తెలుస్తోంది. అయితే ఎంత మార్జిన్‌తో వాళ్లు వెనుకబడ్డారన్నదానిపై నేను మాట్లాడను. బీజేపీ సెట్‌ చేసిన రామమందిరం ఎజెండా కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క వ్యక్తికి చేరింది.

అయితే మేమంతా రామ మందిరం నిర్మిస్తే  రాముని ప్రతిష్టాపన బీజేపీ ఎలా చేస్తుందని వారంతా అడుగుతున్నారు. ఒక మనిషి దేవుని ప్రతిష్ట చేయొచ్చా. ఎవరికైనా అంత శక్తి ఉందా. ఎక్కడైతే వాళ్లు రాముని ప్రతిష్ట చేశారో అక్కడే అయోధ్యలో వాళ్లు ఓడిపోయారు. రాముడు వచ్చాడు. న్యాయం చేశాడు’అని అభిషేక్‌ బెనర్జీ అన్నారు. 

కాగా, లోక్‌సభ ఎన్నికల్లో వెస్ట్‌బెంగాల్‌లో బీజేపీ భారీగా సీట్లు గెలుస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసినప్పటికీ  ఇక్కడ అధికార తృణమూల్‌  కాంగ్రెస్‌ హవానే కొనసాగడం గమనార్హం.  బెంగాల్‌లో తృణమూల్‌కు 29 ఎంపీ  సీట్లు రాగా బీజేపీకి 12, కాంగ్రెస్‌కు ఒకటి వచ్చాయి.      

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)