Breaking News

చింతమనేని వర్గం హల్‌చల్‌.. అబ్బయ్య చౌదరి హెచ్చరిక

Published on Fri, 08/01/2025 - 13:53

సాక్షి, పశ్చిమ గోదావరి: దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని భయానక వాతావరణ సృష్టించారని అన్నారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. చింతమనేని ప్రభాకర్‌ బెదిరింపులకు భయపడేవాడెవారు ఎవరూ లేరు.. తప్పుడు కేసులు పెడితే కోర్టులో మొట్టికాయలు వేసినా వీరికి బుద్ధి రావడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే, దెందులూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి టార్గెట్‌గా చింతమనేని రాక్షస క్రీడకు తెరలేపారు. అబ్బయ్య చౌదరికి చెందిన పంట పొలాలను పచ్చ మూకలు ధ్వంసం చేసి.. వక్క చెట్లను నరుక్కు పోయారు. అంతటితో ఆగకుండా.. అబ్బయ్య చౌదరి ఇంటి ముందు టీడీపీ శ్రేణులు వంటావార్పుకి పిలుపునిచ్చారు. దీంతో, దెందులూరు నియోజకవర్గం కొండలరావు పాలెంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో అబ్బయ్యచౌదరి నివాసానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేరుకున్నారు.  

ఈ క్రమంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దెందులూరు నియోజకవర్గంలోకి అబ్బయ్య చౌదరి వచ్చాడంటే చాలు ఉలిక్కిపడుతున్నారు. టీడీపీ నేతలకు అధికారం ఇచ్చింది దేనికి?. ప్రజలకు మంచి చేయడానికా లేక అబ్బయ్య చౌదరిని టార్గెట్ చేయడానికా?. దెందులూరులో వైఎస్సార్‌సీపీ నేతల ఆస్తులను టార్గెట్ చేస్తున్నారు. చింతమనేని మేము చేసిన అభివృద్ధిలో సంక్షేమంతో పోటీ పడండి.. అంతేకానీ కక్షపూరిత రాజకీయాలు కాదు.

దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని భయానక వాతావరణ సృష్టించారు. చింతమనేని బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు. తప్పుడు కేసులు పెడితే కోర్టులో మొట్టికాయలు వేసినా వీరికి బుద్ధి రావడం లేదు. ఏదో ఒక వంక పెట్టుకుని వచ్చి భయపెట్టాలని చూస్తున్నారు. మాజీ శాసనసభ్యుడి ఇంటి ముందు ఇలా చేయడం ఏంటి?. మేము ఎక్కడికి పారిపోవటం లేదు ఇక్కడే ఉన్నాం.. ఏం చేస్తారో చేయండి?. దుర్మార్గమైన నీచమైన సంస్కృతికి తెర లేపారు. మా తోటలో వక్క చెట్లు నరుక్కుని పోయే బ్యాచులు తయారయ్యారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)